Vishwak Sen: ‘తినే కంచంలో ఉమ్మేసుకున్నట్టే’.. పెద్ది మూవీపై నెగిటీవ్ రివ్యూ.. ఆగ్రహం వ్యక్తం చేసిన విశ్వక్ సేన్
రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కథ నాకు తెలుసు అంటూ నెగిటీవ్ కామెంట్స్ చేశాడు.(Vishwak Sen)దీంతో, ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
Vishwak Sen expressed anger over Peddi movie negative reviews
Vishwak Sen: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నెగిటీవ్ ప్రచారం ఎక్కువ అయ్యింది. ఇక సినిమాల విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. కావాలని నెగిటీవ్ ప్రచారం చేస్తూ సినిమాలను చంపేస్తున్నారు. ఇంతకాలం విడుదలైన సినిమాల విషయంలో అనుకున్నారు. కానీ, విడుదల కానీ సినిమాలపై కూడా నెగిటీవ్ ప్రచారం చేస్తూ దారుణంగా తయారవుతున్నారు కొంతమంది నెటిజన్స్. తాజాగా పెద్ది సినిమాపై నెగిటీవ్ రివ్యూ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమని తాము సినిమా రివ్యూవర్స్ గా చెప్పుకొనే కొంతమంది కుహానా మేధావులు అంతా వీడియో కాల్ లో కలిశారు.
అందులో ఒకతను రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కథ నాకు తెలుసు అంటూ నెగిటీవ్ కామెంట్స్ చేశాడు. దీంతో, ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. మెగా ఫ్యాన్స్ ఈ విషయంపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన సినిమాలను ఎలాగూ చంపేస్తున్నారు. కనీసం, షూటింగ్ కూడా కంప్లీట్ కానీ సినిమాలను ఇలా నెగిటివ్ చేయడం దారుణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ నెగిటీవ్ కామెంట్స్ చేసిన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలనంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఇష్యూపై యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) సైతం స్పందించాడు.
సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.”ఇలాంటి వాడిని సినిమాకు పట్టిన పరాన్నజీవి అని పిలవడం సమంజసమే కదా? ఇతను సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రయోజనం పొందుతాడు, దాని నుంచి వచ్చిన డబ్బుతోనే కుటుంబాన్ని పోషించుకుంటాడు. అయినా కూడా, సినిమా విడుదల కాకముందే దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది తాను తినే పళ్లెంలోనే తానే ఉమ్మినట్లుగా ఉంది” అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో, విశ్వక్ చేసిన ఈ పోస్ట్ సోషలో మీడియాలో వైరల్ గా మారింది. మరి పెద్ది సినిమాపై ఇచ్చిన నెగిటీవ్ రివ్యూ ఇష్యూ ఎక్కడివరకు వెళ్తుంది? అనేది చూడాలి.
