Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కి భారీ ప్రైజ్ మనీ.. కళ్ళు చెదిరే గిఫ్టులు.. గత సీజన్లకు మించి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss 9 Telugu) చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 7న తేదీన గ్రాండ్ గా మొదలైన ఈ సీజన్ డిసెంబర్ 21న జరిగే గ్రాండ్ ఫినాలేతో ఎండ్ కానుంది.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కి భారీ ప్రైజ్ మనీ.. కళ్ళు చెదిరే గిఫ్టులు.. గత సీజన్లకు మించి

Bigg Boss Season 9 winner prize money and Costly Gifts details

Updated On : December 20, 2025 / 2:05 PM IST

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 7న తేదీన గ్రాండ్ గా మొదలైన ఈ సీజన్ డిసెంబర్ 21న జరిగే గ్రాండ్ ఫినాలేతో ఎండ్ కానుంది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను కూడా గతంలో ఎన్నడూ లేనంత గ్రాండ్ గా సెట్ చేస్తున్నారట మేకర్స్. గతవారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ సుమన్ శెట్టి, భరణీలను ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశాడు. ఇక ప్రస్తుతం ఈ సీజన్ కి సంబందించిన టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. వారిలో తనూజ, సంజనా, డిమాన్ పవన్, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.

Preethi Mukundan: గ్లామర్ తో మతిపోగొడుతున్న ప్రీతి ముకుందన్.. ఫొటోలు

వీరిలో ఈ సీజన్ కి ఎవరు విన్నర్ అవుతారు అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అలాగే, విన్నర్ అందుకోబోయే ప్రైజ్ మనీ ఎంత, మనీతోపాటు ఇంకా ఏమేం గిఫ్టులు అందుకున్నారు అనేది తెలుసుకోవడం కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే, హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss 9 Telugu) కి సంబందించిన ప్రైజ్ మనీ ఎంత అనేది గత వారమే చెప్పేశారు. దాని ప్రకారం ఈ సీజన్ విన్నర్ ఏకంగా రూ.50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకోబోతున్నారు.

కేవలం, ప్రైజ్ మనీ మాత్రమే కాదు, కళ్ళు చెదిరే గిఫ్టులను కూడా ఈ సీజన్ విన్నర్ అందుకోబోతున్నాడు. గతంలో మాదిరిగానే ఈ సీజన్ లో కూడా, ప్రముఖ నగల సంస్థ నుంచి లక్షల విలువ చేసే నక్లెస్ ను అందించనున్నారట. అలాగే ప్రముఖ సంస్థ ఖరీదైన కారును కూడా విన్నర్ కి అందించనున్నారు అని తెలుస్తోంది. రూ.50 లక్షల ప్రైజ్ మనీ, నక్లెస్, ఖరీదైన కారు కలిపి దాదాపు రూ.80 లక్షల వరకు గెలుచుకోబోతున్నారట ఈ సీజన్ విన్నర్. అయితే, ఈ ప్రైజ్ మనీలో చాలా వరకు టాక్సుల కింద కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా చూసుకున్నా ఈ సీజన్ విన్నర్ కి మాత్రం అదిరిపోయే రేంజ్ లో మనీ, గిఫ్టులు అందనున్నాయి. మరి ఆ అదృష్టం ఎవరికీ వరిస్తుంది అనేది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.