Director Venu Udugula is making his next film under UV Creations.
Venu Udugula: వేణు ఊడుగుల.. ఈ దర్శకుడి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారదు. ఆ తరువాత రానా- సాయి పల్లవితో విరాటపర్వం సినిమా చేశాడు. ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే, ఆ తరువాత నుంచి మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు ఈ దర్శకుడు. మధ్యలో స్టార్స్ తో సినిమాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ, ఒక్క ప్రాజెక్టు గురించి కూడా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ దర్శకుడు కాస్త నిర్మాతగా మారాడు.
ఆయన నిర్మించిన మొదటి సినిమా రాజు వెడ్స్ రాంబాయి. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది. దీంతో, నిర్మాతగా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వేణు ఊడుగుల(Venu Udugula). ఈ నేపధ్యంలోనే వేణు నెక్స్ట్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వేణు ఊడుగులతో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యిందట.
ఆ సంస్థ మీరేదో కాదు యువీ క్రియేషన్స్. ఈ సంస్థలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వేణు. రీసెంట్ గానే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథ చర్చలు కూడా పూర్తయ్యాయట. ఆయన గత సినిమాల లాగే ఈ సినిమా కోసం కూడా ఒక సాలిడ్ ఎమోషనల్ కంటెంట్ ను రెడీ చేశాడట వేణు ఊడుగుల. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించనున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని టాక్. ఇక హీరో రోషన్ ప్రస్తుతం
“ఛాంపియన్” అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే వేణు ఊడుగుల సినిమా మొదలుకానుంది. మరి చాలా గ్యాప్ తరువాత వేణు చేస్తున్న ఈ సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుంది అనేది చూడాలి.