Pawan Kalyan : సాయి ధరమ్ తేజ్ కి కథ చెప్పాలని ఏకంగా పవన్ నే రికమండేషన్ అడిగిన డైరెక్టర్.. ఇతను మామూలోడు కాదు..

ఈ డైరెక్టర్ మాత్రం సాయి ధరమ్ తేజ్ కి కథ చెప్పాలని ఏకంగా పవన్ కళ్యాణ్ నే రికమండేషన్ అడిగాడట.

Director Vijay Kanakamedala Asks Recommendation to Pawan Kalyan for Sai Dharam Tej

Pawan Kalyan : సాధారణంగా సినీ పరిశ్రమలో ఎవరైనా హీరోలని, స్టార్ డైరెక్టర్స్ ని, నిర్మాతలని కలవాలంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళనో, వాళ్ళ కింద స్థాయి సిబ్బందినో పట్టుకొని రికమండేషన్ తో వెళ్తారు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం సాయి ధరమ్ తేజ్ కి కథ చెప్పాలని ఏకంగా పవన్ కళ్యాణ్ నే రికమండేషన్ అడిగాడట.

నాంది సినిమాతో అల్లరి నరేష్ ని కొత్తగా చూపించి మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు డైరెక్టర్ విజయ్ కనకమేడల. విజయ్ ఇప్పుడు భైరవం సినిమా చేస్తున్నాడు. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి చేస్తున్న ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ తన బ్యాక్ గ్రౌండ్, పవన్ కళ్యాణ్ తో పనిచేసిన దాని గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Also Read : Anchor Ravi – Ramaya Krishnan : టీవీ ప్రోగ్రాంలో రమ్యకృష్ణతో సరదాగా యాంకర్ రవి.. ఫొటోలు..

విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. నేను, హరీష్ శంకర్ క్లోజ్. హరీష్ శంకర్ రెండో సినిమా నుంచి డీజే సినిమా వరకు ఆయనతోనే పనిచేసాను. గబ్బర్ సింగ్ సినిమాకు పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం మర్చిపోలేని విషయం. సెట్ లో అందరూ పవన్ ఫ్యాన్సే. కారవాన్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి. షాట్ గ్యాప్ లో ఉంటే సెట్ కి దూరంగా పవన్ కూర్చునేవారు. షాట్ రెడీ అని రమ్మనడానికి వెళ్తే ఓ రెండు రోజులు చూసి అక్కడ్నుంచి పిలువు, లేదా వాకీలో చెప్పు వచ్చేస్తాను అన్నారు. ఆయనతో బాగానే క్లోజ్ అయ్యాము. పోలీస్ స్టేషన్ లో సాంగ్స్ కామెడీ సీన్ రెండున్నర రోజుల్లో చేసేసాము.

పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పలేదు కానీ గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ షూటింగ్ సమయంలోనే సాయి ధరమ్ తేజ్ కి కథ చెప్పాలని పవన్ కళ్యాణ్ గారినే రికమండేషన్ అడిగాను తేజ్ ని కలిపించండి అని. దాంతో పవన్ ఏకంగా తేజ్ నే గబ్బర్ సింగ్ సెట్స్ కి తీసుకొచ్చి పరిచయం చేసాడు. కొన్నాళ్ళు స్టోరీ డిస్కషన్స్ జరిగాయి కానీ అవి వర్కౌట్ అవ్వక తేజ్ తో సినిమా ఆగిపోయింది అని తెలిపాడు.

Also Read : Vijay Sethupathi : తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి నెక్స్ట్ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా? తెలుగులో కూడా..