×
Ad

Nithin: ఉన్న ఒక్క సినిమా కూడా పోయింది.. విక్రమ్ కూడా పక్కన పెట్టేశాడు.. పాపం నితిన్..

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దొరకడం చాలా కష్టం. ఆలాగే, ఆ దొరికిన ఆవకాశాన్ని(Nithin) సద్వినియోగం చేసువుకోవడం కూడా కష్టమే. ఇక్కడ విజయాలే మాట్లాడతాయి.

Director Vikram K Kumar has removed Nithiin from his next film and has roped in Vijay Deverakonda.

Nithin: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దొరకడం చాలా కష్టం. ఆలాగే, ఆ దొరికిన ఆవకాశాన్ని సద్వినియోగం చేసువుకోవడం కూడా కష్టమే. ఇక్కడ విజయాలే మాట్లాడతాయి. ఎన్ని హిట్స్ వస్తే అంత క్రేజ్. లేదంటే తీసి పక్కన పడేస్తారు. పాపం ఇప్పుడు యంగ్ హీరో నితిన్(Nithin) పరిస్థితి అలాగే తయారయ్యింది. 2016లో వచ్చిన అఆ సినిమా తరువాత ఒక్కటంటే ఒక్క సరైన హిట్టు కూడా పడలేదు నితిన్. మధ్యలో వచ్చిన భీష్మ కాస్త పరవాలేదు అనిపించినా ఆ తరువాత వచ్చిన ఒక్కకి కూడా హిట్ అవలేదు. కనీసం, మినిమమ్ సాటిస్ఫై కూడా చేయలేదు. దీంతో, నితిన్ కెరీర్ డైలమాలో పడింది.

Rahul Sankrityan: విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు.. VD14 చాలా స్పెషల్.. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కామెంట్స్ వైరల్

వరుసగా ప్లాప్స్ రావడంతో నితిన్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల నుంచి కూడా తీసేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా నితిన్ ని “ఎల్లమ్మ” సినిమా నుంచి తీసేసిన విషయం తెలిసిందే. నిజానికి, ఎల్లమ్మ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు నితిన్. కానీ, టైం బ్యాడ్ వేరే హీరో చేతికి వెళుతోంది ఈ సినిమా. ఇక తాజాగా మరో సినిమా నుంచి కూడా నితిన్ ని తీసేశారాట. ఆ సినిమా మరేదో కాదు దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో చేస్తున్న సినిమా. చాలా కాలం క్రితమే నితిన్ కి ఒక అద్భుతమైన, డిఫరెంట్ కథ చెప్పాడట దర్శకుడు విక్రమ్ కె కుమార్. త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అని నితిన్ కూడా చెప్పాడు.

కానీ, ప్రస్తుతం నితిన్ కి బ్యాడ్ టైం నడుస్తుండటంతో ఈ సినిమా నుంచి కూడా మేకర్స్ ఆయన్ని తొలగించారట. త్వరలోనే వేరే హీరోతో అధికారిక ప్రకటన చేయనున్నారట. నిజానికి, గతంలో నితిన్ సేమ్ ఇలాంటి సిచువేషన్ లో ఉన్నప్పుడు ఇష్క్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఇప్పుడు కూడా అలాగే తనకు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడు విక్రమ్ అని అనుకున్నాడు నితిన్. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి నితిన్ ని పక్కన పెట్టేశాడట. ఇప్పుడు నితిన్ ప్లేస్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా కూడా క్యాన్సిల్ అవడంతో ప్రస్తుతం నితిన్ చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. దీంతో, నితిన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. మంచి సినిమాతో రా అన్నా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.