Rahul Sankrityan: విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు.. VD14 చాలా స్పెషల్.. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కామెంట్స్ వైరల్

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన(Rahul Sankrityan) ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. నిజం చెప్పాలంటే ఆయన హిట్టు చూసి దాదాపు 7 ఏళ్ళు అయ్యింది.

Rahul Sankrityan: విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు.. VD14 చాలా స్పెషల్.. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కామెంట్స్ వైరల్

Director Rahul Sankrityan gives an update on Vijay Deverakonda's 14th film

Updated On : October 16, 2025 / 2:58 PM IST

Rahul Sankrityan; రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. నిజం చెప్పాలంటే ఆయన హిట్టు చూసి దాదాపు 7 ఏళ్ళు అయ్యింది. అది కూడా గీత గోవిందం తరువాత ఆయనకు ఇప్పటివరకు సరైన హిట్ లేదు. అయినా కూడా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన మూవీ కింగ్డమ్. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాతో ఖచ్చితంగా సాలిడ్ హిట్ అందుకుంటాడు విజయ్ అనుకున్నారు అంతా. కానీ, ఈ సినిమా కూడా ఇటు విజయ్ ని, అటు ఆయన ఫ్యాన్స్ కి నిరాశపరిచింది.

Akira Nandan: అకిరాని చూస్తే సిగ్గేస్తోంది.. ట్రెండ్ అవుతున్న యూట్యూబర్ కవర్ సాంగ్.. ఇది మాస్ క్రేజ్ సామీ

ఇక కింగ్డమ్ తరువాత విజయ్ దేవరకొండ రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan)తో చేస్తున్న సినిమా. పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో మైత్రి మూవీస్ చేస్తున్న ఈ సినిమా నుంచి అధికారిక వచ్చి చాలా కాలమే అయ్యింది కానీ, ఇంకా షూటింగ్ మాత్రం మొదలవలేదు. కాకపోతే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అయితే, పీరియాడికల్ డ్రామాతో వస్తున్న సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చాలా సమయం పెడుతోందట. అందుకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని సమాచారం.

ఇక, తాజాగా విజయ్ దేవరకొండతో తాను చేయబోతున్న సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారంటూ చెప్పుకొచ్చాడు. “ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. సినిమాలో విజయ్ నట విశ్వరూపం చూస్తారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు రవికిరణ్ కోలాతో “రౌడీ జనార్ధన” అనే మాస్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయినా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.