Director Vinay Ratnam interesting comments about Sri Chidambaram garu movie.
Vinay Ratnam: ఈమధ్య కాలంలో చిన్న సినిమాలతో వస్తున్న దర్శకులు మంచి విజయాలు సాధిస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఆ మాటను ప్రూవ్ చేశాయి. అలా తెలుగులో వస్తున్న సినిమా శ్రీ చిదంబరం గారు. కొత్త దర్శకుడు వినయ్ రత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్నారు. రూరల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కూడా ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీకి కలుగజేసింది.
Lenin: పెద్ది ఎఫెక్ట్.. అఖిల్ ‘లెనిన్’ సినిమా వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?
మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది. నిజానికి ఈ సినిమా పోస్టర్స్, టైటిల్, ట్రైలర్ చూసిన చాలా మంది ఇదేదో మలయాళ సినిమా అనుకున్నారు. కానీ, ఇది పక్కా తెలుగు సినిమా. దాదాపు అంతా కొత్తవాళ్లతో చేసిన ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందా అనేది చూడాలి మరి. అయితే, ఈ సినిమా విడుదల సందర్బంగా దర్శకుడు వినయ్ రత్నం(Vinay Ratnam) ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
సిరి చిదంబరం గారు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వినయ్ రత్నం మాట్లాడుతూ.. ఈమధ్య కాలంలో రివ్యూలు అనేవి చాలా పెద్ద టాపిక్ అయ్యింది. ఇస్తే మంచిదే అని కొందరు, రివ్యూ ల వల్ల సినిమాలకు ఆడియన్స్ రావడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ, నేను మా సినిమాకు అలాంటివి ఏమీ చెప్పను. దయచేసి మా సినిమాకు రివ్యూలు ఇవ్వండి. అప్పుడే కదా మేము ఏ తప్పులు చేశాము, ఎక్కడ సరి చేసుకోవాలనే అంశాలు అర్థం అవుతాయి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో దర్శకుడు వినయ్ రత్నం చేసిన ఈ వింత కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ దర్శకుడి కామెంట్స్ సినిమాకు ఎలా హెల్ప్ అవుతాయా అనేది చూడాలి.