Yash : స్టార్డమ్ టాక్.. కాంట్రవర్సీలో యశ్!
పాన్ ఇండియా స్టార్‌డమ్‌పై యశ్ (Yash) ఇటీవల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రచ్చకు దారితీస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.
Is Yash pan india comments makes debate on social media
Yash : పాన్ ఇండియా స్టార్‌డమ్‌పై యశ్ ఇటీవల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రచ్చకు దారితీస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి టాలీవుడ్ స్టార్స్‌ను ఉద్దేశించేలా యశ్ మాట్లాడారంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండగా..యశ్ ఎవరి స్టార్‌డమ్‌ను తక్కువ చేయలేదని, తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాడని కన్నడ అభిమానులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
దీంతో సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య పోస్టులు, కామెంట్ల వార్ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్‌ను మీడియా ఇచ్చింది మాత్రమే కాదు..తమ హీరోలు సాధించిన విజయాలే ఆ స్థాయిని తీసుకొచ్చాయని టాలీవుడ్స్ స్టార్స్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం యశ్ ఫ్యాన్స్ వర్సెస్ టాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ అనే కొత్త ఫ్యాన్ వార్ నడుస్తుంది.
Kajal Aggarwal : కొడుకుతో క్యూట్ ఏఐ ఫోటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్..
టాక్ షోలో..యాంకర్ యశ్‌ను ప్రశ్నిస్తూ..మిగతా సౌత్ స్టార్స్ మీలాగా పూర్తిస్థాయి పాన్ ఇండియా సూపర్ స్టార్లుగా ఎందుకు ఎదగలేకపోయారని క్వశ్చన్ వేశారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చిన యశ్ స్టార్ ఇమేజ్ శాశ్వతం కాదని స్పష్టం చేశాడు. పాన్ ఇండియా స్టార్ అనే పదం మనం చేసే పనిని బట్టి వచ్చే ఒక టెర్మినాలజీ మాత్రమేనని, చిత్ర పరిశ్రమలో ఏ ట్యాగ్ కూడా పర్మినెంట్‌గా ఉండదన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క శుక్రవారం బాక్సాఫీస్ ఫలితం ఎవరి భవితవ్యాన్నైనా మార్చేయగలదని చెప్పారు.
శుక్రవారం థియేటర్లలో వచ్చే తీర్పును బట్టి స్టార్లు, పాన్ ఇండియా హోదాలు మారిపోతుంటాయని, కాలంతో పాటు విజయాలు రావడం, పోవడం సహజమన్నాడు యశ్. ఆయనిచ్చిన సమాధానంపై టాలీవుడ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే పాన్ ఇండియా ట్రెండ్‌ను అత్యధికంగా నడిపిస్తున్నది తెలుగు సినిమానేనని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అయితే ఇది అభిమానుల మధ్య సోషల్ మీడియా చర్చ మాత్రమేనా.. లేక రాబోయే రోజుల్లో మరింత పెద్ద వివాదంగా మారుతుందా అనేది వేచి చూడాలి.
