Anil Raviudi : డైరెక్టర్ అనిల్ రావిపూడి సాధించిన రికార్డ్స్ తెలుసా? 8 హిట్ సినిమాలతో..
కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మెసేజ్ కూడా ఇస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఆలోచింపచేస్తున్నాడు అనిల్ రావిపూడి.

Do Yo Know about Director Anil Ravipudi Records Froma Pataas to Sankranthiki Vasthunnam
Anil Raviudi : అందరూ హీరోల రికార్డుల గురించే మాట్లాడతారు. కానీ అప్పుడప్పుడు దర్శకుల రికార్డుల గురించి కూడా మాట్లాడతారు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి కొంత లాభాలు వస్తేనే రికార్డులు కొట్టినట్టు, స్టార్ డైరెక్టర్ అయినట్టు కాదు. తక్కువ బడ్జెట్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస హిట్స్ సాధించి నిర్మాతలకు బోలెడన్ని లాభాలు ఇచ్చినా స్టార్ దర్శకుడే. అలాంటి దర్శకుడు అనిల్ రావిపూడి.
మాములు బడ్జెట్ తో స్టార్ హీరోలతో సినిమాలు తీసి వరుస హిట్స్ ఇస్తున్నాడు. 2005 లోనే సినీ పరిశ్రమకు వచ్చిన అనిల్ రావిపూడి పలు సినిమాలకు దర్శకత్వ శాఖలలో పనిచేసి 2008 శౌర్యం సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ్నుంచి అనేక సినిమాలకు రచయితగా, అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి 2015లో కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
అప్పటివరకు వరుస ఫ్లాప్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్ కు పటాస్ సినిమాతో మంచి హిట్ ఇచ్చి కళ్యాణ్ రామ్ సెకండ్ ఇన్నింగ్స్ లా మార్చాడు. పటాస్ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్, రవితేజతో రాజా ది గ్రేట్, వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో F2, మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ, వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో F3, బాలకృష్ణతో భగవంత్ కేసరి, ఇప్పుడు వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరుసగా 8 హిట్స్ కొట్టాడు. ఈ కాలంలో ఉన్న దర్శకులకు వరుసగా రాజమౌళి తర్వాత 8 హిట్స్ అంటే అనిల్ రావిపూడినే.
కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మెసేజ్ కూడా ఇస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఆలోచింపచేస్తున్నాడు అనిల్ రావిపూడి. దర్శకుడిగా వరుసగా 8 హిట్స్ కొట్టడమే కాదు అన్ని సినిమాలు నిర్మాతలకు ప్రాఫిట్స్ ఇచ్చాయి. అలాగే వరుసగా 5 సినిమాలు 100 కోట్ల గ్రాస్ దాటాయి. F2 నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు అన్ని సినిమాలు 100 కోట్ల గ్రాస్ దాటాయి. అలాగే అమెరికాలో వరుసగా అయిదు సినిమాలు 1 మిలియన్ డాలర్స్ దాటాయి. ఈ జనరేషన్ లో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి కే ఈ రికార్డులు సాధ్యమయ్యాయి.
Also Read : Varun Tej : వరుణ్ తేజ్ బర్త్ డే.. కొత్త సినిమా అనౌన్స్.. కొరియాలో హారర్ కామెడీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఆల్రెడీ సరిలేరు నీకెవ్వరూ సినిమాతో 200 కోట్ల గ్రాస్, అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ దాటించిన అనిల్ రావిపూడి ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 200 కోట్ల గ్రాస్, 2 మిలియన్ డాలర్స్ దాటించబోతున్నాడు. ఇప్పుడున్న దర్శకులలో రాజమౌళి తర్వాత అన్నివిధాలుగా 100 శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచారు. నెక్స్ట్ చిరంజీవితో సినిమా చేయనున్నారు అనిల్ రావిపూడి. మరి ఆ సినిమా ఇంకే రేంజ్ లో హిట్ అయి రికార్డులు సాధిస్తుందో చూడాలి.
అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి సినిమాలు క్రింజ్ కామెడీ అని విమర్శలు చేసినా వాటికి కౌంటర్ ఇస్తూ నా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం నేను ఇలాగే సినిమాలు తీస్తాను అని చెప్పారు అనిల్.