Hanu Kotla : ‘ఈశ్వర్’ సినిమాలో ప్రభాస్ పక్కన మూగవాడిగా నటించిన అబ్బాయి గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ పక్కన ఉండే ఫ్రెండ్స్ లో మూగ పాత్ర చేసింది హను కోట్లనే.

Do You Kmow about Hanu Kotla who acted in Friend Role of Prabhas in Eeswar Movie

Hanu Kotla : ఈశ్వర్ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు చాలా మంది సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అందులో ఒకరు హను కోట్ల. ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ పక్కన ఉండే ఫ్రెండ్స్ లో మూగ పాత్ర చేసింది హను కోట్లనే. మొదటి సినిమాలోనే మూగవాడిగా నటించి కామెడీ, ఎమోషన్ తో మెప్పించాడు. ఆ తర్వాత నటుడిగా, డైరెక్టర్ గా ప్రయాణం చేయాలనుకున్నా కుదరలేదు. ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా తన ఉద్యోగరీత్యా వదులుకున్నాడు.

హను కోట్ల హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో బి.ఎ యాక్టింగ్, ఎం.ఎ. మీడియా డైరెక్షన్ కోర్సుల్లో ఉపాధ్యాయుడిగా కొనసాగాడు. తెలుగు నాటక రంగంలో నటుడిగా, దర్శకుడిగా అనేక నాటకాలు, ప్రయోగాలు చేసాడు. తెలుగులో మొట్ట మొదటి నాటకత్రయం ప్రతాపరుద్ర నాటకాన్ని కూడా హను కోట్ల మూడు భాగాలుగా ప్రదర్శించాడు. నాటక రంగంపై జాతీయ, అంతర్జాతీయ సెమినార్ లలో పాల్గొని నాటక అధ్యాపకులుగా నటన, దర్శకత్వంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చి పేరు తెచ్చుకున్నాడు. నాటకాల్లో నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు. డాక్టరేట్ కూడా తెచ్చుకున్నాడు.

Also Read : Srikanth : ‘వెంకటలక్ష్మితో.. యాడాది కిందట’ టైటిల్ పోస్టర్ లాంచ్.. శ్రీకాంత్ చేతుల మీదుగా.. టైటిల్ భలే ఉందే..

ఇన్నేళ్ల తర్వాత హను కోట్ల ఇప్పుడు హీరోగా మళ్ళీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తనే హీరోగా, డైరెక్టర్ గా ‘ది డీల్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. సిటడెల్ క్రియేషన్, డిజిక్విస్ట్ సంయుక్త నిర్మాణంలో ‘ది డీల్’ సినిమా తెరకెక్కుతుంది. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుంది. ఆల్రెడీ మొదటి పార్ట్ హైదరాబాద్, మలేషియాలో షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ది డీల్ పార్ట్ 1 సినిమా అక్టోబర్ లో దసరాకి రానున్నట్టు సమాచారం. ఇటీవలే దిల్ రాజు చేతుల మీదుగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమాలో చందన, ధరణి ప్రియా హీరోయిన్స్ గా నటించగా, రఘు కుంచె, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

ట్రెండింగ్ వార్తలు