Srikanth : ‘వెంకటలక్ష్మితో.. యాడాది కిందట’ టైటిల్ పోస్టర్ లాంచ్.. శ్రీకాంత్ చేతుల మీదుగా.. టైటిల్ భలే ఉందే..

తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌‌ను హీరో శ్రీకాంత్ లాంచ్ చేసారు.

Srikanth : ‘వెంకటలక్ష్మితో.. యాడాది కిందట’ టైటిల్ పోస్టర్ లాంచ్.. శ్రీకాంత్ చేతుల మీదుగా.. టైటిల్ భలే ఉందే..

Srikanth Launched Title Poster of Venkatalakshmitho Yadadi Kindata Movie

Updated On : September 1, 2024 / 2:03 PM IST

రఘు గద్వాల్ హీరోగా, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న సినిమా వెంకటలక్ష్మితో.. యాడాది కిందట’. టింట్ స్ప్రీ స్టూడియోస్ బ్యానర్‌‌పై ఆలేటి రాజేష్ నిర్మాణంలో రామమూర్తి కొట్టాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌‌ను హీరో శ్రీకాంత్ లాంచ్ చేసారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. టైటిల్ క్యాచీగా బాగుంది. అందరూ యువ టీమ్ చేసారు ఈ సినిమాని. షార్ట్ ఫిలింస్ తో ఫేమస్ అయిన రఘు ఈ సినిమాతో హీరోగా మెప్పిస్తాడు. ఓ కొత్త కంటెంట్‌తో ఈ సినిమా రాబోతుంది అంటూ మూవీ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Also Read : Bigg Boss Telugu 8 : సింగిల్‌గా కాదు.. జోడీలుగానే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ.. తొలి రోజే సూప‌ర్ ట్విస్ట్..

Srikanth Launched Title Poster of Venkatalakshmitho Yadadi Kindata Movie

హీరో రఘు గద్వాల మాట్లాడుతూ.. అందరూ కొత్తవాళ్లతో సంవత్సరం క్రితం ఈ సినిమాని మొదలుపెట్టాం. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీకాంత్ గారు మాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది అని తెలిపాడు. డైరెక్టర్ రామమూర్తి మాట్లాడుతూ.. ఇది స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం. దీనికి థ్రిల్లర్, సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ కూడా జోడించాం. ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫీల్‌ ఇస్తుంది ఈ సినిమా అని తెలిపారు.

నిర్మాత ఆలేటి రాజేష్ మాట్లాడుతూ.. సంవత్సరం క్రితం సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసాము. డైరెక్టర్ తో సహా సహా అంతా కొత్త వారితో ఈ సినిమాని తెరకెక్కించాం. మా టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని తెలిపారు.