Bigg Boss Telugu 8 : సింగిల్‌గా కాదు.. జోడీలుగానే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ.. తొలి రోజే సూపర్ ట్విస్ట్..
మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది.

Bigg Boss Telugu 8 Grand Launch 1st Promo
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కానుంది. నేడు కంటెస్టెంట్లను హౌజ్‌లోకి పంపించనున్నారు. ఎవరెవరు హౌజ్‌లోకి వెళతారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ప్రొమో ఆసక్తిని మరింత పెంచింది.
బిగ్‌బాస్ హౌజ్‌ని చూపిస్తూ ప్రొమో ప్రారంభమైంది. ఈ సీజన్ లిమిట్‌లెస్ అంటూ నాగార్జున అన్నారు. ఈసారి కంటెస్టెంట్స్‌ను సోలోగా పంపడం లేదు అని ట్విస్ట్ ఇచ్చారు నాగ్. జోడీలుగా హౌజ్‌లోకి పంపనున్నారు. ఇక ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్‌లో భాగంగా నాని-ప్రియాంక మోహన్‌లు సందడి చేశారు. కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Rajinikanth : నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం.. రజినీకాంత్ స్పెషల్ ట్వీట్
’35 చిన్న కథ కాదు’ ప్రమోషన్స్ కోసం రానా, నివేదా థామస్ లు సైతం వచ్చారు. వీరిద్దరితో నాగ్ చేసిన కామెడీ ఆకట్టుకుంది. చివరిలో దర్శకుడు అనిల్ రావిపూడి హౌజ్‌లోకి వెళ్లాడు. ‘ఈ సారి లిమిట్ లెస్ అంటా.. ట్విస్ట్ అంటా.. టర్న్ అంటా.. ఆ పని ఫస్ట్ వీక్ నుంచే మొదలు పెడుతున్నారు. సో మీలో ఒకరిని ఇప్పుడు బయటకు తీసుకువెళ్లాలి. వారి ప్లేస్‌లో మరొకరు స్వాప్ అయి లోపలికి వస్తారు.’ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు రావిపూడి.