Akhil – Zainab Ravdjee : అఖిల్ పెళ్లి చేసుకోబోయే జైనబ్ రవ్జీ ఎవరు? అఖిల్ కంటే పెద్దదా? ఆమె బ్యాక్ గ్రౌండ్, ఫ్యామిలీ బిజినెస్ గురించి తెలుసా?

అఖిల్ జైనబ్ రవ్జీని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయి గురించి తెలిసిన వివరాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Do You Know about Akhil Akkineni Fiance Zainab Ravdjee Details Here

Akhil – Zainab Ravdjee : నేడు అక్కినేని అఖిల్ జైనబ్ రవ్జీ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడని నాగార్జున అధికారికంగా పోస్ట్ చేసాడు. దీంతో అఖిల్ జైనబ్ రవ్జీని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయి గురించి తెలిసిన వివరాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

జైనబ్ రవ్జీ అఖిల్ కంటే పెద్దది అని తెలుస్తుంది. అఖిల్ కి 30 ఏళ్ళు కాగా జైనబ్ రవ్జీకి 39 ఏళ్ళు అని సమాచారం. దీంతో అఖిల్ తనకంటే పెద్దదైన అమ్మాయిని చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఇక జైనబ్ రవ్జీ థియేటర్ ఆర్టిస్ట్, ఒక పెయింట్ ఆర్టిస్ట్ అని సమాచారం. ఆమె వేసిన పెయింట్స్ పలు పెయింట్ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శించబడినట్టు తెలుస్తుంది. ఇక జైనాబ్ రవ్జీ హైదరాబాద్ లో పుట్టినా ఢిల్లీ, దుబాయ్, ముంబైలో పెరిగింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నట్టు సమాచారం. ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేది కానీ నేడు అఖిల్ తో నిశ్చితార్థం ప్రకటించాక ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని ప్రైవేట్ గా మార్చేసింది. ఆమె అకౌంట్ ని రానా, మిహీక, ఉపాసన, మెహ్రీన్.. ఇలా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఫాలో అవుతున్నారు. అలాగే జైనాబ్ రవ్జీకి రానా భార్య మిహీకకు మంచి స్నేహం ఉంది. జైనాబ్ రవ్జీ సొంతంగా ఓ బ్యూటీ కేర్ కంపెనీ కూడా నడిపిస్తుంది.

Also See : Akhil Akkineni Engagement : నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్.. ఫొటోలు వైరల్..

జైనబ్ రవ్జీ ప్రముఖ బిజినెస్ మెన్ అయిన జుల్ఫీ రవ్జీ కూతురు. ZR Renewable Energy తో పాటు పలు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇండియా, దుబాయ్, లండన్ లో వీరికి కంపెనీలు ఉన్నట్టు సమాచారం. జైనాబ్ రవ్జీ తండ్రి జుల్ఫీ రావడ్జీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు అని, దుబాయ్ చుట్టుపక్కల అరబ్ దేశాల్లో ఏపీ ప్రభుత్వం తరపున జగన్ అడ్వైజర్ గా కూడా ఉన్నారని సమాచారం. అలాగే నాగార్జునకు కూడా బిజినెస్ పరంగా అత్యంత సన్నిహితుడు అని తెలుస్తుంది. జుల్ఫీ రవ్జీ – నాగార్జున మధ్య చాలా కాలం నుంచే స్నేహం ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే జైనాబ్ రవ్జీ – అఖిల్ ది పెద్దలు కుదిర్చిన పెళ్లా లేక ప్రేమ పెళ్లా అనేది క్లారిటీ లేదు. కొంతమంది రానా – మిహీక పెళ్ళిలో వీరు కలుసుకొని ఇన్నాళ్లు ప్రేమించుకొని ఇప్పుడు పెళ్ళికి రెడీ అవుతున్నారని అంటున్నారు. పలువురు నాగార్జున – జుల్ఫీ రవ్జీ మధ్య వ్యాపార సంబంధాలు, స్నేహంతో పెద్దలు కుదిర్చిన పెళ్లిగా వీరి పెళ్లి జరుగుతుందని కూడా అంటున్నారు. వీటిపై అధికారికంగా అయితే క్లారిటీ లేదు.