Bigg Boss6 Shrihan: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ శ్రీహాన్‌ గురించి మీకు తెలుసా..

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. ఈ సీజన్‌లో మూడో కంటెస్టెంట్‌గా "శ్రీహాన్‌" బిగ్‌బాస్‌ స్టేజ్ పైకి చిల్ బ్రో అంటూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్‌బాస్‌ సీజన్‌-5 సమయంలో కంటెస్టెంట్‌ సిరి బాయ్‌ఫ్రెండ్‌గా పాపులర్‌ అయిన శ్రీహాన్‌...

Do You Know About BigBoss Contestant Shrihaan

Bigg Boss6 Shrihan:: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. “ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తరవాతే” అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ బిగ్‌బాస్‌ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకి పిలిచాడు.

BiggBoss 6: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సుదీప(పింకీ) గురించి మీకు తెలుసా..

ఈ సీజన్‌లో మూడో కంటెస్టెంట్‌గా “శ్రీహాన్‌” బిగ్‌బాస్‌ స్టేజ్ పైకి చిల్ బ్రో అంటూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్‌బాస్‌ సీజన్‌-5 సమయంలో కంటెస్టెంట్‌ సిరి బాయ్‌ఫ్రెండ్‌గా పాపులర్‌ అయిన శ్రీహాన్‌ పలు షార్ట్‌ఫిల్మ్స్‌, యూట్యూబ్‌ వీడియోలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత సీజన్‌ లో సిరి సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురికాగా, ఆ సమయంలో శ్రీహాన్‌ ఆమెకు అండగా నిలబడి మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం వీళ్లిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అంతేకాదు వీళ్లిద్దరు ఒక బాబుని కూడా దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. కాగా బిగ్‌బాస్‌ సీజన్‌ 6కి ఎంట్రీ ఇచ్చిన శ్రీహాన్‌ను “సిరి ఏమన్నా సలహాలు ఇచ్చి పంపిందా” అని అడిగిన నాగార్జున ప్రశ్నకు..”తను ఇచ్చిన సలహాలు ఏవి నేను వినిపించుకోలేదు సర్” అంటూ బదులిచ్చాడు. గత సీజన్‌లో సిరి ఏదైతే కోలుపోయిందో అది నేను తనకి గిఫ్ట్ గా ఇద్దామనుకుంటున్న అంటూ బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు.