Do You Know about Bigg Boss Fame Actor Maanas Nagulapalli Remuneration and Properties
Maanas : చైల్డ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా సినిమాల్లో నటించినా సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు మానస్ నాగులపల్లి. బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయి ఇప్పుడు సీరియల్స్, షోలు, సిరీస్ లు చేస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి మానస్ ఇంటర్వ్యూ ఇవ్వగా అతని రెమ్యునరేషన్స్, ఆస్తుల వివరాలు అడిగారు.
ఈ క్రమంలో మానస్ మాట్లాడుతూ.. వైజాగ్ లో తాత, తండ్రుల నుంచి వచ్చిన పొలాలు ఉన్నాయి. వైజాగ్ లో ఒక ఇల్లు ఉంది. హైదరాబాద్ లో మూడు ఫ్లాట్స్ ఉన్నాయి అని తెలిపాడు. అలాగే షోకి ఒక రోజుకు లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు తీసుకుంటాను అని తెలిపాడు. డైరెక్టర్, నిర్మాణ సంస్థలతో ఉన్న రిలేషన్స్ తో అప్పుడప్పుడు తక్కువకు అడిగినా చేస్తాను. కానీ నా వర్క్ ఎక్కువ ఉంది, డిమాండ్ చేయొచ్చు అంటేనే ఎక్కువ డిమాండ్ చేస్తాను అని చెప్పాడు.
Also Read : Dhanush : ఒకే ఫ్రేమ్‌లో ధనుష్-ఐశ్వర్య.. రజనీకాంత్ పోస్ట్ వైరల్..
ఇక మానస్ షోలు, సీరియల్స్, సిరీస్ లతో నెలలో ఆల్మోస్ట్ 30 రోజులు కూడా బిజీగానే ఉంటాను అని చెప్పాడు. మానస్ సీరియల్స్ లో ఎపిసోడ్ కి 25 వేల వరకు తీసుకుంటాడని సమాచారం. మొత్తానికి చేతినిండా పనితో నెలలో 30 రోజులు కష్టపడుతూనే బాగా సంపాదిస్తున్నాడు అని తెలుస్తుంది. అలాగే మానస్ తల్లి పద్మిని నాగులపల్లి ఫిలిం ఛాంబర్, సెన్సార్ బోర్డు.. ఇలా సినీ పరిశ్రమలలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. మానస్ ఫ్యామిలీకి పలు బిజినెస్ లు కూడా ఉన్నాయి.