Dhanush : ఒకే ఫ్రేమ్‌లో ధనుష్-ఐశ్వర్య.. రజనీకాంత్ పోస్ట్ వైరల్..
తమిళ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యలు గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Dhanush And Aishwarya Rajinikanth Reunite For Emotional Moment At Sons Graduation
తమిళ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్నప్పటికి కూడా తల్లిదండ్రులుగా మాత్రం బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. వీరిద్దరు తమ కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరు అయ్యారు. వీరిద్దరు తమ కుమారుడిని కౌగించుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యాత్ర.. తల్లిదండ్రులుగా మేమిద్దరం ఈ రోజు ఎంతో గర్వపడుతున్నాం అంటూ గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను ధనుష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Prabhas : స్పిరిట్ కోసం ప్రభాస్ అలా..
View this post on Instagram
అటు సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఇదే ఫోటోను పోస్ట్ చేస్తూ.. నా మనవడు తొలి మైలురాయిని దాటాడు. కంగ్రాట్స్ యాత్ర కన్నా.. అని రాసుకొచ్చాడు.
First milestone crossed my lovable grandson 💐 congratulations yathra kanna ! ❤️❤️ pic.twitter.com/D15JexNw4g
— Rajinikanth (@rajinikanth) May 31, 2025
2004లో ధనుష్, ఐశ్వర్యలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కొడుకులు సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట 2022లో విడిపోతున్నట్లుగా ప్రకటించారు. అప్పటి నుంచి వీరిద్దరు వేరు వేరుగానే ఉంటుండగా 2024 నవంబర్‌లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.