Adi Reddy: బిగ్‌బాస్‌6లో కామన్‌ మ్యాన్‌గా ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి గురించి మీకు తెలుసా..

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. ఈ సీజన్‌లో కామన్‌ మ్యాన్‌గా ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి. ఇతను ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో పుట్టి పెరిగాడు. చదువు తర్వాత ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేసిన...

Do You Know About BiggBoss Contestant Adi Reddy

Adi Reddy: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. “ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తరవాతే” అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ బిగ్‌బాస్‌ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకి పిలిచాడు.

BiggBoss 6 Marina And Rohit: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ మెరీనా-రోహిత్‌ జోడీ గురించి మీకు తెలుసా..

ఈ సీజన్‌లో కామన్‌ మ్యాన్‌గా ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి. ఇతను ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో పుట్టి పెరిగాడు. చదువు తర్వాత ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆది మొదట్లో సినిమాలు, క్రికెట్, సోషల్ ఇన్సిడెంట్స్ పై వీడియోలు చేసేవాడు. 2019లో పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌పై ఆది వీడియోలు చేయడం ప్రారంభించాడు..

ఆ వీడియోలతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది, తెలుగు ప్రజలలో పేరు మరియు మంచి గుర్తింపు పొందాడు. 2020లో కవిత అనే అమ్మాయితో వివాహం కాగా ఆది సోదరి నాగ లక్ష్మితో కలిసి కవిత కూడా తమ సొంత యూట్యూబ్ ఛానెల్ ‘కవితా నాగ వ్లాగ్స్’ని ప్రారభించింది. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి బిగ్‌బాస్‌ స్టేజ్ వరకు వచ్చిన ఆదిరెడ్డి ఇకపై ఎలా రాణించగలడో చూడాలి.