Chiranjeevi First Car : చిరంజీవి ఫస్ట్ కార్ ఏంటో తెలుసా? నిర్మాత ఇస్తానని ఇవ్వకపోవడంతో..

చిరు మొదటి కారు మాత్రం సొంతంగా కొనుక్కోలేదు.

Do You Know about Chiranjeevi First Car Here Interesting Details

Chiranjeevi First Car : మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది అభిమానులతో పాటు కోట్లకు కూడా అధిపతి. ఏమి లేని రోజుల నుంచి ఎంతో సంపాదించే రేంజ్ కి ఎదిగిన నటుడు. చిరు దగ్గర ఖరీదైన వస్తువులు చాలానే ఉన్నాయి. అందులో కార్స్ కూడా. చిరు దగ్గర రోల్స్ రాయ్స్ లాంటి కారే ఉంది. చరణ్ దగ్గర కూడా చాలానే కార్లు ఉన్నాయి. ఇప్పుడు చరణ్, చిరు కావాలనుకుంటే ఎంత ఖరీదైన కారైనా కొనుక్కోగలరు.

అయితే చిరు మొదటి కారు మాత్రం సొంతంగా కొనుక్కోలేదు. చిరంజీవి గతంలో తన మొదటి కార్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. చిరంజీవి మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో నా ఆరో సినిమా ఐ లవ్ యు చేస్తున్నప్పుడు ఆ సినిమా నిర్మాత దగ్గర ఫియట్ కార్ ఉండేది. చూడటానికి చాలా క్యూట్ గా బాగుండేది. ఆ కార్ నాకు బాగా నచ్చింది. దాని గురించి నిర్మాతని పదే పదే అడగటంతో సినిమాలో బాగా యాక్టింగ్ చేసి నన్ను మెప్పిస్తే ఆ కార్ గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పారు. దీంతో ఆ పాత్ర కోసం ఎక్కువ కష్టపడి, డైలాగ్స్ ముందే నేర్చుకొని మరీ నటించాను. అందరికి ఆ కార్ వస్తుందని చెప్పేసాను. కానీ నేను ఎంత కష్టపడి నటించినా మరి నా యాక్టింగ్ నిర్మాతకు నచ్చలేదేమో ఆ కార్ నాకు ఇవ్వలేదు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా నిర్మాత కార్ ఇవ్వకపోవడంతో నేను చాలా నిరుత్సాహ పడ్డాను. ఆ సమయంలో కార్ విషయంలో నేను చాలా నిరుత్సాహ పడటంతో మా నాన్న చూసి ఒకరు నీకు ఇవ్వడమేంటి నేను ఇస్తాను అని చెప్పారు. అప్పుడు నేను సంపాదిస్తున్నా నా డబ్బులు తీసుకోకుండా ఆయన దాచుకున్న డబ్బులతో నాకు ఫస్ట్ కార్ కొనిచ్చారు మా నాన్న అని తెలిపారు.

Also Read : Aditi Rao Hydari : సిద్దార్థ్ నాకు ఆ స్కూల్‌లో ప్రపోజ్ చేసాడు.. మా పెళ్లి ఆ గుడిలోనే జరుగుతుంది..

ఇక కార్ గురించి చెప్తూ.. మా నాన్న కొనిచ్చిందే నాకు ఫస్ట్ కార్. అది ఫియట్ మోడల్ కార్. AAN 2087 దాని నంబర్. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో ఉండేది. ఆ కార్ కొన్న దగ్గర్నుంచి దాన్ని చాలా ఇష్టంగా చూసుకునేవాడిని. నేనే డ్రైవింగ్ చేసే వాడిని. అది డ్రైవ్ చేస్తుంటే అందరూ మనల్నే చూస్తున్నారు అనుకునేవాడిని. డ్రైవర్ ఉన్నా కూడా ఎక్కువగా తోలనిచ్చేవాడిని కాదు. మా అమ్మ నాన్న అప్పుడు నెల్లూరులో ఉండేవారు. నెల్లూరు – మద్రాసుకి అమ్మ నాన్నలు రావడానికి ఆ కారే వాడేవాడ్ని. ఆ కార్ ఉన్నప్పుడే నాకు పెళ్లి అయింది. నేను, సురేఖ కలిసి ఆ కార్ లో మద్రాస్ అంతా చక్కర్లు కొట్టేవాళ్ళం. సురేఖ కూడా ఆ కార్ బాగా చూసుకునేది అని తెలిపారు. అలా చిరంజీవి 1979 లో మొదటి కార్ కొనుక్కున్నారు. ఫస్ట్ కార్ కోసం అంత కష్టపడ్డ చిరంజీవికి ఇప్పుడు ఇంట్లోనే దాదాపు 10 ఖరీదైన కార్లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు