Janhvi Kapoor
Janhvi Kapoor : పెద్ద సినిమాల్లో స్టార్స్ కి యాక్షన్స్ లో లేక వాళ్ళు అందుబాటులో లేనపుడు కొన్ని సజెషన్ షాట్ సీన్స్ లోనో డూప్స్ ని వాడుతూ ఉంటారు. తాజాగా పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కి డూప్ గా ఓ అమ్మాయి చేస్తుందని తెలియడంతో ఆ భామ వైరల్ గా మారింది. బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవర తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు చరణ్ తో పెద్ది సినిమాలో కనిపించబోతుంది.(Janhvi Kapoor)
ఇటీవలే పెద్ది సినిమా నుంచి జాన్వీ కపూర్ పోస్టర్స్, చికిరి చికిరి అనే సాంగ్ కూడా రిలీజ్ చేసారు. అయితే పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కి డూప్ గా నటి బాంధవి శ్రీధర్ నటిస్తుందట. మసూద సినిమాలో సంగీత కూతురిగా దయ్యం పట్టిన పాత్రలో అందర్నీ మెప్పించింది బాంధవి శ్రీధర్. ఆ తర్వాత సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతుంది.
Also Read : Sundeep Kishan : స్టార్ హీరో కొడుకు.. అన్ని వద్దనుకుని నా కోసం.. సందీప్ వ్యాఖ్యలు వైరల్..
బాంధవి శ్రీధర్ ఇపుడు పెద్ది సినిమాలో జాన్వీకి డూప్ గా నటిస్తుందట. జాన్వీ ఫిజిక్ కి దగ్గరగా ఉండటంతో మేకర్స్ బాంధవిని తీసుకున్నారట. ఇప్పటికే ఆమెపై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని సమాచారం. అలాగే బాంధవి శ్రీధర్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటిస్తుందట. హీరోయిన్ లెవల్లో ఉండే ఈ భామ తన సోషల్ మీడియా ఫొటోలతోనే వైరల్ అవుతుంది. మరి పెద్దిలో కీలక పాత్ర, జాన్వీ కపూర్ కి డూప్ గా చేసే ఈ భామ భవిష్యత్తులో హీరోయిన్ గా సినిమాలు చేస్తుందేమో చూడాలి.
ఇక బాంధవి శ్రీధర్ చికిరి చికిరి సాంగ్ డ్యాన్స్ మాస్టర్ జానీతో కలిసి ఆ పాటకు స్టెప్పులేసి క్యూట్ వీడియో కూడా తన సోషల్ మీడియాలో ఇటీవలే షేర్ చేసింది.
Also See : Sobhita Dhulipala : ఆహా.. జీన్స్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో శోభిత ధూళిపాళ.. ఫొటోలు..