Sundeep Kishan : స్టార్ హీరో కొడుకు.. అన్ని వద్దనుకుని నా కోసం.. సందీప్ వ్యాఖ్యలు వైరల్..
చిన్న, మీడియం హీరోల తనయులు కూడా హీరోలు అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. (Sundeep Kishan)
Sundeep Kishan
Sundeep Kishan : సినీ పరిశ్రమలో హీరోల కొడుకులు హీరోలు చాలా మందే ఉన్నారు. చిన్న, మీడియం హీరోల తనయులు కూడా హీరోలు అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక నిర్మాతల కొడుకులు, దర్శకుల కొడుకులు కూడా హీరోలే అవ్వాలనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో స్టార్ హీరో కొడుకు దర్శకుడిగా మారాడు.(Sundeep Kishan)
తమిళ్ స్టార్ హీరో విజయ్ రేంజ్ అందరికి తెలిసిందే. మన పవన్ కళ్యాణ్ రేంజ్. విజయ్ కూడా స్టార్ గా సినిమా కెరీర్ ఉన్నా జనాల్లోకి రాజకీయాలు అంటూ వచ్చాడు. విజయ్ కొడుకు తలుచుకుంటే హీరోగా ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా మారి మన తెలుగు హీరో సందీప్ కిషన్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సిగ్మా అనే టైటిల్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
Also Read : RGV : ఇది కదా ‘ఆర్జీవీ’ రేంజ్.. లైఫ్ టైం కలెక్షన్స్.. మూడు రోజుల్లో ఊదేశారు..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ గురించి మాట్లాడుతూ.. విజయ్ గారి అబ్బాయి సంజయ్ ఒక 24 ఏళ్ళ అబ్బాయి. తమిళ రాష్ట్రానికి సినిమా వారసుడు తనే. ఆ రేంజ్ లో అక్కడ ఇంకో వారసుడు లేడు. తను అనుకుంటే ఏమైనా వస్తుంది. స్టార్ డైరెక్టర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో ఫస్ట్ టైం డెబ్యూ హీరోగా సినిమా సెట్ చేసుకోవచ్చు. కానీ అతను నాకు ఇవేమి వద్దు. నేను డైరెక్షన్ చేయాలి, నాకు సందీపే కావాలి అన్నాడు.
సెట్ లో ప్రతిరోజు అతని వర్క్ చూస్తాను. అతనితో పనిచేయడానికి నాకు పెద్ద కారణం అవసర్లేదు. విజయ్ ఫ్యాన్స్ ఎంతమంది నా సినిమా చూస్తారు ఇవన్నీ సెకండరీ. అవన్నీ దాటి ఇలా ఒక మనిషి ఆలోచిస్తున్నాడు. ఒక 24 ఏళ్ళు ఉన్న ఇలాంటి అబ్బాయిని నేను ఎప్పుడూ కలవలేదు. అతను తలుచుకుంటే అన్ని చేతిలోకి వస్తాయి కానీ వద్దనుకున్నాడు. ఏమి లేకుండానే సక్సెస్ తెచ్చుకుంటాను అని రెడీ అయ్యాడు. అతని కోసం సినిమా చేయొచ్చు అని అన్నారు. దీంతో సందీప్ వ్యాఖ్యలు వైరల్ గా మారగా పలువురు జాసన్ సంజయ్ ని అభినందిస్తున్నారు.
Also Read : Sobhita Dhulipala : ఆహా.. జీన్స్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో శోభిత ధూళిపాళ.. ఫొటోలు..
