Venkitesh : ‘కింగ్డమ్’ ఈవెంట్లో వైరల్ అయిన ఈ నటుడు తెలుసా? రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముతూ స్టార్ గా ఎదిగి..

మలయాళంకి చెందిన ఈ నటుడు తెలుగులో కింగ్డమ్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తున్నాడు.

Venkitesh

Venkitesh : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రేపు జులై 31 రిలీజ్ అవ్వనుంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరగ్గా కింగ్డమ్ సినిమాలో విలన్ గా నటించిన వెంకటేష్ తన స్పీచ్ తో బాగా వైరల్ అయ్యాడు. మలయాళంకి చెందిన ఈ నటుడు తెలుగులో కింగ్డమ్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తున్నాడు.

కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకటేష్ మాట్లాడుతూ.. ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాను. నాకు సెట్ లో కారవాన్ ఇచ్చిన మొదటి సినిమా ఇది. నేను తెలుగులో ఇంకా సినిమాలు తీయాలి. ఇక్కడి డైరెక్టర్స్ నాకు చాన్సులు ఇవ్వండి అంటూ సరదాగా మాట్లాడాడు. ఇతని స్పీచ్ కి విజయ్, అనిరుద్, భాగ్యశ్రీ తో పాటు అందరూ నవ్వేశారు. దీంతో వెంకటేష్ వైరల్ అవ్వడంతో తను ఎవరా అని వెతికేస్తున్నారు నెటిజన్లు.

Also See : 90s Stars Reunion : 90s రీ యూనియన్.. అలనాటి స్టార్స్ ఒకేచోట.. ఫొటోలు వైరల్.. ఎవరెవరు ఉన్నారో చూడండి..

వెంకటేష్ కేరళ త్రివేండ్రంకి చెందిన వ్యక్తి. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసాడు. మధ్యలో టీవీ షోలు, సీరియల్స్ చేసాడు. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు లేనప్పుడు బతుకు తెరువు కోసం తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ ఇడ్లీ షాప్ పెట్టాడు. త్రివేండ్రంలో రోడ్ మీద ‘సుడా సుడా ఇడ్లీ’ అనే స్టాల్ ని పెట్టాడు. ఇక్కడ రకరకాల ఇడ్లీలు దొరుకుతాయి. ఈ ఇడ్లీ షాప్ బాగా వైరల్ అయి క్లిక్ అయింది. అక్కడ లోకల్ గా, సోషల్ మీడియాలో కూడా సుడా సుడా ఇడ్లీకి మంచి ఫేమ్ వచ్చింది.

అలా ఇడ్లీలు అమ్ముతూనే సినిమాల్లో ఛాన్సులు వస్తే చేస్తున్నాడు. తమిళ్ లో ఓ సినిమాలో విలన్ గా చేసాడు. మలయాళంలో ఓ చిన్న సినిమాలో హీరోగా చేసాడు. ఇప్పుడు కింగ్డమ్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే సినిమాలు చేస్తున్నా మెల్లిగా ఎదుగుతున్నా తన ఇడ్లీ షాప్ ని మాత్రం మర్చిపోలేదు. ఇప్పటికి షూటింగ్ లేకపోతే తన షాప్ కి వెళ్లి ఇడ్లీలు అమ్ముతాడు. అక్కడికి వచ్చిన కస్టమర్లకు ఫొటోలు ఇస్తాడు. అలా ఇడ్లీలు అమ్ముకుంటూ ఎదిగి ఇప్పుడు స్టార్ నటుడిగా దూసుకుపోతున్నాడు వెంకటేష్.

Also Read : Tollywood : టాలీవుడ్ లో మళ్ళీ సినీ కార్మికుల సమ్మె..? షూటింగ్స్ ఆగిపోతాయా?