Tollywood : టాలీవుడ్ లో మళ్ళీ సినీ కార్మికుల సమ్మె..? షూటింగ్స్ ఆగిపోతాయా?
సినీ పరిశ్రమలో మళ్ళీ సినీ కార్మికులు సమ్మె చేసే యోచనలో ఉన్నారు.

Tollywood
Tollywood : సినీ పరిశ్రమలో మళ్ళీ సినీ కార్మికులు సమ్మె చేసే యోచనలో ఉన్నారు. నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో సినీ కార్మికుల వేతనాలు పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు జరగ్గా అవి విఫలం అయ్యాయి. గతంలో ప్రతీ మూడేళ్లకోసారి 30% పెంచాలని ఒప్పుకున్నా నిబంధన గత నెల జూన్ 30వ తేదీతో ముగిసింది.
తాజాగా జరిగిన చర్చల్లో ఫిల్మ్ ఛాంబర్ లో ఫెడరేషన్ ప్రతినిధులతో 5% మాత్రమే పెంచుతామని చెప్పారు. దీనికి ఇది మాకు సమ్మతం కాదు అని మాకు అనుకూలంగా పెంచిన వారికే ఆగస్టు ఫస్ట్ నుంచి షూటింగ్ కి హాజరవుతామని ఫెడరేషన్ వారు చెప్పారు. అయితే రేపు ఉదయం 11.30 గంటలకు కార్మిక సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో కార్మిక భవన్ లో మరోసారి చర్చలు జరగనున్నాయి.
Also Read : Naga Vamsi : కన్నడ స్టార్ హీరోతో తెలుగు నిర్మాత భారీ సినిమా..
ఈ చర్చల్లో సమస్య కొలిక్కి రాకపోతే ఆగస్టు ఫస్ట్ నుంచి సినీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతారని సమాచారం. దీంతో ఆగష్టు 1 నుంచి షూటింగ్స్ ఆగిపోతాయని తెలుస్తుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ కి జనాలు రాక, హిట్స్ లేక నిర్మాతలకు గడ్డు కాలం నడుస్తుంది. ఇలాంటి సమయంలో కార్మికులు ఏకంగా 30 శాతం పెంచమనడంపై టాలీవుడ్ నిర్మాతలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి రేపు జరిగే చర్చలు సఫలం అవుతాయా, షూటింగ్స్ కి సమ్మె బ్రేక్ పడకుండా జరుగుతాయా చూడాలి.