×
Ad

Mrunal Thakur – Lochan Thakur : మృణాల్ ఠాకూర్ అక్క లోచన్ ఠాకూర్ గురించి తెలుసా? స్టార్ మేకప్ ఆర్టిస్ట్..

మృణాల్ బయట, సినిమాల్లో అంత అందంగా కనిపించడానికి కారణం ఎవరో తెలుసా?

Do You Know about Mrunal Thaku Sister Lochan Thakur

Mrunal Thakur – Lochan Thakur : మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సీతారామం సినిమాతో స్టార్ హీరోయిన్ అయిన మృణాల్ ఇటీవల హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో అలరించింది. ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్స్ లో మృణాల్ ఒకరు. అయితే మృణాల్ బయట, సినిమాల్లో అంత అందంగా కనిపించడానికి కారణం ఎవరో తెలుసా?

Also See : Thalapathy Vijay 69 Movie : విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్.. ఫోటోలు వైరల్.. పూజా హెగ్డే, మమిత బైజులతో విజయ్ సందడి..

మృణాల్ అందానికి కారణం తన అక్క లోచన్ ఠాకూర్. లోచన్ ఠాకూర్ మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ గా సినీ పరిశ్రమలో దూసుకుపోతుంది. మృణాల్ మొదటి సినిమా నుంచి కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు మృణాల్ ఠాకూర్ కి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసింది ఆమె అక్క లోచన్. సీతారామం, ఇటీవల హాయ్ నాన్న సినిమాల్లో మృణాల్ ని అంత అందంగా చూపించింది ఆమె అక్కే.

అలాగే మృణాల్ కి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా కూడా లోచన్ పని చేస్తుంది. అంతే కాకుండా బాలీవుడ్ లో సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్ గా, పలువురు సెలబ్రిటీలకు కూడా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంది లోచన్. గతంలో పలు మార్లు మృణాల్ తన అక్కతో దిగిన ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. తాజాగా నేడు లోచన్ పుట్టిన రోజు కావడంతో మృణాల్ తన అక్కతో కలిసి చిన్నప్పుడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ గా బర్త్ డే విషెష్ తెలిపింది.