Pavani Karanam : పుష్ప 2లో అల్లు అర్జున్‌ని చిన్నాన్న అని పిలిచే ఆ నటి ఎవరో తెలుసా..? సినిమా కథని మలుపు తిప్పే పాత్ర..
పావని పాత్ర వల్ల ఓ సన్నివేశంతో సినిమా కథ కీలక మలుపు తిరుగుతుంది. సి

Do You Know about Pavani Karanam a Key Role Played in Allu Arjun Pushpa 2 Movie
Pavani Karanam : పుష్ప 2 సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో అదరగొడుతుంది. ఈ సినిమాలో నటించిన అందరూ తమ నటనతో మెప్పించారు. అయితే సినిమాలో మెయిన్ లీడ్స్ కాకుండా కథని మలుపు తిప్పే పాత్రలో, కథలో కీలక పాత్రలో పావని అనే నటి చాలా బాగా నటించి మెప్పించింది. సినిమాలో పావని అజయ్ కూతురు పాత్రలో నటించింది. అల్లు అర్జున్ ని చిన్నాన్న.. అంటూ పిలుస్తూ చాలా యాక్టివ్ గా ఉండే పాత్ర.
అయితే పావని పాత్ర వల్ల ఓ సన్నివేశంతో సినిమా కథ కీలక మలుపు తిరుగుతుంది. సినిమాలో అల్లు అర్జున్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రెండు ఫైట్ సీక్వెన్స్ లు పావని పాత్ర కోసమే చేయాల్సి వస్తుంది. దీంతో ఈ నటి సినిమాలో కీలకంగా మారుతుంది. అలాగే క్లైమాక్స్ ఈ నటితోనే ఎండ్ అవుతుంది. పుష్ప 1 నుంచి చూపించిన ఓ ఎమోషన్ కూడా ఈ నటితోనే పూర్తవుతుంది. దీంతో పావనికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. సినిమాలో తన నటనతో కూడా మెప్పించింది.
Also Read : Pushpa 2 : పుష్ప 2.. రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే ఆన్ లైన్ లో సినిమా మొత్తం లీక్..
ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈమె తెలుగమ్మాయి. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పరేషాన్, పైలం పిలగా సినిమాల్లో పావని హీరోయిన్ గా నటించింది. పరేషాన్ సినిమాలో.. సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ వల్ల బాగా ఫేమస్ అయింది. హిట్ 2 సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. పుష్ప 1 లో కూడా కొన్ని సీన్స్ లో కనిపించిన పావని ఇప్పుడు పుష్ప 2 లో కీలక పాత్ర పోషించింది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు, తన సినిమాల గురించి పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. మరి ఫ్యూచర్ లో ఇంకెన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుందో, ఇలాంటి కీలక పాత్రలతో మెప్పిస్తుందో చూడాలి. సినిమా రిలీజ్ కి ముందు పుష్ప 2 గురించి ఓ తెలుగమ్మాయి డ్రీం నెరవేరిందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.