Site icon 10TV Telugu

Upasana : రామ్ చరణ్ కి ఉపాసన పెట్టిన లవ్ టెస్ట్ ఇదే అంట.. డేటింగ్ లో ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లమని..

Do You Know about Upasana Love Test to Ram Charan

Upasana

Upasana : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ క్యూట్ కపుల్స్ లో చరణ్ – ఉపాసన జంట ఒకరు. ఉపాసన బిజినెస్ రంగంలో దూసుకుపోతుంది. చరణ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన బిజినెస్, ఫ్యామిలీ అప్డేట్స్ ఇస్తూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన.

తాజాగా ఉపాసన ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో చరణ్ కి ఓ లవ్ టెస్ట్ పెట్టానని చెప్పుకొచ్చింది.

Also Read : War 2 Pre Release Event : వర్షం పడినా ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.. సెలబ్రిటీలు ఓకే.. కానీ ఫ్యాన్స్ తడవాల్సిందేనా?

ఉపాసన మాట్లాడుతూ.. పెళ్ళికి ముందు డేటింగ్ చేసేటప్పుడు చరణ్ ని నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తే ‘ఫేమస్ ఐస్ క్రీం’ షాప్ కి తీసుకువెళ్ళు అని అడిగా. ఓల్డ్ సిటీ మొజంజాహి మార్కెట్ లో ఫేమస్ ఐస్ క్రీం షాప్ ఉంటుంది. అక్కడ ఐస్ క్రీం బాగుంటుంది. నా ఫేవరేట్. హైదరాబాద్ లో ఉన్న ఓల్డెస్ట్ ఐస్ క్రీం షాప్స్ లో అది ఒకటి. అది మార్కెట్ మిడిల్ లో ఉంటుంది. అప్పటికే చరణ్ స్టార్. అందరూ గుర్తుపడతారు. అయినా నేను అడిగానని ఓకే చెప్పి నన్ను తీసుకెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లి నాకు ఐస్ క్రీం ఆర్డర్ చేసాడు. అక్కడ ఉన్న జనాలు చరణ్ ని చూసి మమ్మల్ని చుట్టుముట్టేశారు. నేను అతనికి పెట్టిన నిజమైన లవ్ టెస్ట్ అదే. ఆ తర్వాత రేర్ గా పలుమార్లు వెళ్ళాము అక్కడికి అని తెలిపింది.

Also Read : Mega Heros : జిమ్ లో మెగా కజిన్స్.. పవర్ ఫుల్ లుక్స్.. ఫొటో వైరల్..

Exit mobile version