Bollywood : ఒక్క వైరల్ వీడియోతో ఆ నటి కెరీర్ నాశనం.. సూపర్ స్టార్ల ఫ్యామిలీ నుండి వచ్చిన ఆ నటి ఎవరంటే?

స్టార్ డమ్ రాగానే సరిపోదు.. దానిని నిలబెట్టుకోవడంలోనే అంతా ఉంటుంది. ఎంతో సక్సెస్‌ను చూసిన ఓ నటి కెరియర్ ఒకే ఒక్క వైరల్ వీడియో తర్వాత సర్వ నాశనం అయ్యింది. ఎవరా నటి? ఏంటా స్టోరీ.. చదవండి.

Riya Sen 1

Bollywood : రియా సేన్.. ఒకప్పుడు ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్.. ఒకే ఒక్క వీడియో ఆమె సినీ కెరియర్‌ను నాశనం చేసింది. బాలీవుడ్‌కి దూరం చేసింది. బెంగాలీ సినిమాల్లో నటించినా బాలీవుడ్‌‌లో వచ్చినంత సక్సెస్‌ను అందుకోలేకపోయింది. కారణం ఏంటి? అసలు ఏం జరిగింది?

 

Riya Sen

Salaar Song : సలార్ నుంచి మరో కొత్త సాంగ్ రిలీజ్.. విన్నారా? ప్రతి గాథలో రాక్షసుడే..

బాలనటిగా కెరియర్ ప్రారంభించిన నటి రియా సేన్ బాలీవుడ్‌లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. హిందీతో పాటు బెంగాలీ, తెలుగు, తమిళ సినిమాల్లో కనిపించారు. అందానికి కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే రియాకు 42 సంవత్సరాలంటే ఎవరూ నమ్మలేరు. 1998 లో 17 సంవత్సరాల వయసులో ఫల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియో ‘యాద్ పియా కి ఆనే లగీ’ లో రియా కనిపించినపుడు అందరూ ఫిదా అయిపోయారు. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న రియా అనేక సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, ఫ్యాషన్ షోలలో కనిపించారు.

రియా సేన్ రాజరిక నేపథ్యం నుండి వచ్చారు. తండ్రి భరత్ తేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందినవారు కాగా తల్లి మూన్ మూన్ సేన్, అమ్మమ్మ సుచిత్రా సేన్ ప్రముఖ నటీమణులు. వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రియా 1991 లో ‘విష్కన్య’ సినిమాలో బాలనటిగా నటించారు. 2001 లో వచ్చిన ‘స్టైల్ కమర్షియల్ హిట్ అయ్యింది. 2003 లో వచ్చిన ‘ఝంకార్ బీట్స్’, 2005 లో వచ్చిన ‘అనంతభద్రం’ సినిమాలు ఆమె కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి. సినిమాల సంగతి అలా ఉంటే రియాకు అక్షయ్ ఖన్నా, రచయిత సల్మాన్ రష్డీతో సంబంధాలున్నాయంటూ వార్తలు వచ్చాయి. వీరితో పాటు భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌తో రియాకు సంబంధం ఉందంటూ వార్తలు వినపడ్డాయి.

Prashanth Neel : సలార్ సినిమా గురించి ప్రశాంత్ నీల్ స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా?

2005 లో రియా సేన్ నటుడు అష్మిత్ పటేల్ మధ్య ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. ఆ సమయంలోనే వారిద్దరి MMS లీక్ అయ్యింది. ఆ వీడియో ఆ తర్వాత అనేక వివాదాలకు కారణమైంది. కొందరిని ఆకర్షించడానికి రియానే ఉద్దేశపూర్వకంగా MMS లీక్ చేసారంటూ వార్తలు వచ్చాయి. అయితే రియా, అష్మిత్ ఆ వీడియో నకిలీదంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఈ MMS లీక్ అయిన తర్వాత రియా సేన్ కెరియర్ పూర్తిగా దెబ్బతినడంతో బాలీవుడ్ కి దూరమయ్యారు. ఆ సమయంలో ఇతర భాషల్లో నటించారు రియా. 2016-2019 మధ్య ‘అలీషా, రాగిణి MMS: రిటర్న్, పాయిజన్, మిస్ మ్యాచ్ వంటి 4 వెబ్ సిరీస్ లలో నటించినా OTT ప్లాట్‌ఫారమ్ ఆమెకు పూర్వపు ఛరిష్మాను తీసుకురాలేకపోయింది.