×
Ad

Vishnupriya : విష్ణుప్రియ మొదటి సంపాదన ఎంతో తెలుసా? ఇండస్ట్రీలోకి రాకపోతే ఆ పని చేసేదంట..

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ తన మొదటి రెమ్యునరేషన్స్ గురించి తెలిపింది. (Vishnupriya)

Vishnupriya

Vishnupriya : యాంకర్ గా ఫేమ్ తెచ్చుకున్న విష్ణుప్రియ బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. టీవీ షోలతో పాటు సినిమాలు, సిరీస్ లలో నటిగా బిజీగానే ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది విష్ణుప్రియ. సోషల్ మీడియాలో ప్రమోషన్ కి, సినిమాల్లో, టీవీలో బాగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది విష్ణుప్రియ.(Vishnupriya)

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ తన మొదటి రెమ్యునరేషన్స్ గురించి తెలిపింది.

Also Read : Divvela Madhuri : బిగ్ బాస్ లో దివ్వెల మాధురి రెమ్యునరేషన్ ఎంత? ఆ డబ్బు ఏం చేస్తారు?

విష్ణుప్రియ తన మొదటి సంపాదనల గురించి మాట్లాడుతూ.. చిన్నప్పుడు భగవద్గీత క్లాసెస్ కి వెళ్లి దానికి సంబంధించి పోటీలలో పాల్గొన్నా. భగవద్గీత పోటీలలో ప్రైజెస్ వచ్చేవి. అందులో 500, వెయ్యి ఇలా చాలా ప్రైజెస్ వచ్చాయి. అవన్నీ అప్పుడు మా అమ్మకు ఇచ్చాను. పరిశ్రమలోకి వచ్చాక ఫన్ బకెట్ వీడియోకి మొదట 500 ఇచ్చారు. సినిమాల్లో అయితే మొదట 30 వేలు రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఇప్పుడైతే లక్షల్లోనే తీసుకుంటున్నాను పాత్ర నిడివిని బట్టి అని చెప్పింది.

అలాగే.. గతంలో పాకెట్ మనీ కోసం భగవద్గీత క్లాసెస్ చెప్పేదాన్ని. నెలకు రెండు మూడు వేలు వచ్చేవి అప్పట్లో. సినిమాల్లోకి రాకపోతే అదే చేసేదాన్నేమో. భగవద్గీత క్లాసెస్ చెప్పేదాన్ని అని తెలిపింది.

Also Read : Sudheer Babu : అయ్యో.. ఇప్పటిదాకా మహేష్ ని బావ అని పిలవలేదంట.. పిలిస్తే.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్..