Sudheer Babu : అయ్యో.. ఇప్పటిదాకా మహేష్ ని బావ అని పిలవలేదంట.. పిలిస్తే.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్..
ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Sudheer Babu)
Sudheer Babu
Sudheer Babu : మహేష్ బాబు చెల్లి ప్రియదర్శినిని హీరో సుధీర్ బాబు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు హీరో అవ్వకముందే వీళ్ళ పెళ్లి జరిగింది. ఇండస్ట్రీలోకి మహేష్ బాబు బావ, కృష్ణ అల్లుడు అని ఎంట్రీ ఇచ్చినా తను సోలోగానే ప్రయత్నాలు చేసి వరుస సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ బాబు ఎన్ని హిట్స్ కొట్టిన మహేష్ బావ అనే ఎక్కువగా సంబోధిస్తారు. ప్రమోషన్స్ లో, ఇంటర్వ్యూలలో మహేష్ ప్రస్తావన కచ్చితంగా వస్తుంది.(Sudheer Babu)
సుధీర్ బాబు జటాధర సినిమాతో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Vishnupriya : మూడేళ్ళ వయసులో అమ్మనాన్న విడిపోయారు.. నాన్నతో మాట్లాడటం అమ్మకు ఇష్టం లేదు.. అమ్మ చనిపోయాక..
మహేష్ ని మీరు బావ అనే పిలుస్తారా ఇంకేమని ఇలుస్తారు అని అడగ్గా సుధీర్ బాబు సమాధానమిస్తూ.. నేను మహేష్ అనే పిలుస్తాను. బావ అని పిలవను. అసలు బావ అని ఇప్పటిదాకా పిలవలేదు. బావ బామ్మర్ది అని పిలిస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది కానీ సిగ్గేస్తుంది. ఎప్పుడైనా బావ అని పిలిస్తే మహేష్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. నేను హ్యాపీగా బావ అని పిలిచినా మహేష్ నమ్మడు. ఏంటి పనేంటి అన్నట్టు చూస్తాడు అని అన్నారు. మరి ఫ్యూచర్ లో అయినా సుధీర్ బాబు మహేష్ ని బావ అని పిలుస్తాడేమో చూడాలి.
