Devisri Prasad : పవన్ గారు మళ్ళీ డ్యాన్స్ చేయాలనిపించింది అన్నారు.. ఉస్తాద్ భగత్ సింగ్ పై దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ వైరల్..

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ పై, పవన్ కళ్యాణ్ పై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ చేసారు. (Devisri Prasad)

Devisri Prasad : పవన్ గారు మళ్ళీ డ్యాన్స్ చేయాలనిపించింది అన్నారు.. ఉస్తాద్ భగత్ సింగ్ పై దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ వైరల్..

Devisri Prasad

Updated On : November 3, 2025 / 7:55 AM IST

Devisri Prasad : పవన్ కళ్యాణ్ ఇటీవల OG సినిమాతో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. 2026 లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాన్నాళ్ల తర్వాత మళ్ళీ అదిరిపోయే డ్యాన్స్ వేశారు అని ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ చేసి మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.(Devisri Prasad)

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ పై, పవన్ కళ్యాణ్ పై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ చేసారు. జగపతిబాబు జయమ్ము నిశ్చయమ్మురా షోకి వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడారు.

Also Read : Vishnupriya : మొన్న ఉదయభాను, సౌమ్య.. ఇవాళ విష్ణుప్రియ.. వాళ్లకు నా మీద కుళ్ళు.. టాలీవుడ్ యాంకర్స్ మధ్య ఏం జరుగుతుంది?

దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ అదిరిపోతుంది. సినిమా చాలా బాగా వస్తుంది. ఒక్కో సీన్ లో పవన్ కళ్యాణ్ ని చూస్తే బాక్స్ బద్దలైపోద్ది. రెండు సాంగ్స్ షూటింగ్ జరిగాయి. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారు డ్యాన్స్ ఇరగదీశారు. లొకేషన్ కి రమ్మంటే షూటింగ్ రోజు నేను వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. దేవి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత నాకు డ్యాన్స్ చేయాలనిపించేలా చేసావు ఫుల్ ఎనర్జీ తో సాంగ్స్ కుమ్మేసావు అన్నారు. మొన్న హరీష్ గారు సాంగ్స్ రష్ చూపించారు. మాకు అయితే వన్స్ మోర్ అని స్టూడియోలో సెలబ్రేట్ చేసుకున్నాము. మేమైతే ఫుల్ హ్యాపీ. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ హరీష్ – పవన్ గారితో కలిసి చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.

దేవిశ్రీ కామెంట్స్ వైరల్ అవ్వగా పవన్ కళ్యాణ్ మరోసారి డ్యాన్స్ అదరగొడుతున్నారు అని తెలియడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు.

Also Read : NTR Neel : ఇంకెన్నిరా బాబు.. ఎన్టీఆర్ నీల్ సినిమా కూడా అంతే.. దేవర, సలార్ గురించే ఏమి తెలీదు..