Vishnupriya : మొన్న ఉదయభాను, సౌమ్య.. ఇవాళ విష్ణుప్రియ.. వాళ్లకు నా మీద కుళ్ళు.. టాలీవుడ్ యాంకర్స్ మధ్య ఏం జరుగుతుంది?
తాజాగా యాంకర్ విష్ణుప్రియ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. (Vishnupriya)
Vishnupriya
Vishnupriya : సినీ, టీవీ పరిశ్రమలో ఎదుగుతున్న వాళ్ళను తొక్కేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. చాలామంది ఈ విషయాన్ని బయటపెట్టారు. కొత్తవాళ్లు ఎదిగితే తమకు ఎక్కడ నష్టం జరుగుతుందో అని ఫీల్ అయి వాళ్ళతో పోటీగా ఉన్నవాళ్లను ఇంకో రకంగా ట్రీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సంఘటనలు టాలీవుడ్ యాంకర్స్ మధ్య కూడా జరుగుతున్నాయి అని తెలుస్తుంది.
తెలుగులో యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కొత్త కొత్త యాంకర్స్ వస్తూనే ఉన్నారు. అయితే గత కొన్నాళ్లుగా తెలుగు పరిశ్రమ యాంకర్స్ చేసే వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల కొన్నాళ్ల క్రితం సీనియర్ యాంకర్, నటి ఉదయభాను ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇక్కడ యాంకర్స్ లో పెద్ద సిండికేట్ జరుగుతుంది. అన్ని ఛాన్సులు మాకు రావు. ఇక్కడ ఛాన్స్ రావాలంటే అదృష్టం ఉండాలి అని చెప్పడంతో ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : NTR Neel : ఇంకెన్నిరా బాబు.. ఎన్టీఆర్ నీల్ సినిమా కూడా అంతే.. దేవర, సలార్ గురించే ఏమి తెలీదు..
ఆ తర్వాత ఉదయభాను వ్యాఖ్యలు సమర్ధిస్తూ జబర్దస్త్ ఫేమ్ యాంకర్ సౌమ్య.. ఉదయభాను గారు అన్నట్టు ఇక్కడ ఒక పెద్ద సిండికేట్ జరుగుతుంది. అది వంద శాతం ఉంది అని కామెంట్స్ చేసింది. దీంతో టాలీవుడ్ లో కొత్త యాంకర్స్ ని రానివ్వట్లేదా, అన్ని షోలు, ఈవెంట్స్ కొంతమందే పంచుకుంటున్నారా అనే చర్చ జరిగింది.
తాజాగా యాంకర్ విష్ణుప్రియ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. విష్ణుప్రియ పోవే పోరా షోతో యాంకర్ గా బాగా ఫేమ్ తెచ్చుకుంది. అనంతరం పలు పండగల స్పెషల్ షోలలో కూడా యాంకర్ గా చేసింది. ఆ తర్వాత యాంకర్ గా చెయ్యట్లేదు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ ఎందుకు యాంకరింగ్ చెయ్యట్లేదు అని అడిగారు.
దీనికి విష్ణుప్రియ సమాధానమిస్తూ.. నా తోటి యాంకర్స్ కి నా మీద కుళ్ళు . ఈమె ఏంటి రాగానే పేరు తెచ్చేసుకుంది. మేము కష్టపడినా రావట్లేదు అని కుల్లుకున్నారు. వాళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు. అంతే కాకుండా యాంకరింగ్ నాకు కంప్లీట్ గా రాదు. అప్పుడు సుధీర్ ఉంది కాబట్టి వర్కౌట్ అయింది. యాంకరింగ్ లో నా వీక్నెస్ ఏంటో నాకు తెలుసు. అందుకే రెగ్యులర్ గా చేయట్లేదు. అప్పుడప్పుడే చేస్తున్నాను అని తెలిపింది.
దీంతో విష్ణుప్రియ ఎదుగుదల ని చూసి కుళ్లుకున్న ఆ తోటి యాంకర్స్ ఎవరో అని చర్చ జరుగుతుంది. మొత్తానికి టాలీవుడ్ యాంకర్స్ మధ్యే ఏదో జరుగుతుంది అని తెలుస్తుంది. కొంతమందిని పట్టించుకోవట్లేదు, ఎదగనివ్వకుండా చేస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. మరి ఈ వ్యాఖ్యలపై వేరే యాంకర్స్ ఎవరైనా స్పందిస్తారా చూడాలి.
