Venu Swamy : అమ్మ హాస్పిటల్ లో.. లక్షల్లో బిల్లు.. డబ్బుల కోసం వేణుస్వామికి ఫోన్ చేస్తే.. విష్ణుప్రియ ఎమోషనల్..
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్లి హెల్త్ గురించి, అప్పుడు తాను పడ్డ ఇబ్బందుల గురించి చెప్పింది విష్ణుప్రియ.(Venu Swamy)
Venu Swamy
Venu Swamy : యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ బిజీగానే ఉంది. రెండేళ్ల క్రితం తన తల్లి మరణించినట్టు అధికారికంగానే తెలిపింది. చిన్న వయసులోనే హెల్త్ సమస్యలతో విష్ణుప్రియ తల్లి మరణించింది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్లి హెల్త్ గురించి, అప్పుడు తాను పడ్డ ఇబ్బందుల గురించి చెప్పింది విష్ణుప్రియ.(Venu Swamy)
విష్ణుప్రియ మాట్లాడుతూ.. మా అమ్మ 42 ఏళ్లకే చనిపోయింది. డబ్బులు లేక ఒకానొక సమయంలో మందులు వేసుకోలేదు. మా అమ్మకు డయాబెటిస్ ఉంది. మందులు వేసుకోకపోవడంతో రియాక్షన్ వచ్చింది. మెడికల్ చెకప్ చేయించేది కాదు. హార్ట్ స్ట్రోక్ వచ్చేంతవరకు హాస్పిటల్ కి వెళ్ళలేదు మా అమ్మ. నేను చెకప్ చేయిద్దాం తీసుకెళ్తా అని అడిగినా వద్దు అనేది. స్ట్రోక్ వచ్చాక హాస్పిటల్ లో జాయిన్ చేస్తే మూడు రోజుల్లో చనిపోతుంది అని డాక్టర్లు చెప్పారు. కానీ దేవుడి దయ వల్ల ఒక సంవత్సరం బతికింది.
అమ్మ హాస్పిటల్ లో ఉన్నప్పుడు బిల్లు లక్షల్లో అయింది. నేను అప్పటిదాకా ఎవర్ని డబ్బులు అడగలేదు. కానీ డబ్బులు అడగాల్సిన పరిస్థితి. నా జీవితంలో వరస్ట్ ఫేజ్ అది. వేణుస్వామి గురించి అందరూ ఏదో ఏదో చెప్తారు. అవన్నీ వాళ్ళ ఇష్టం. కానీ ఆయన నాకు ఎప్పట్నుంచో తెలుసు. మా అమ్మ హాస్పిటల్ లో ఉన్నప్పుడు డబ్బుల కోసం నేను వేణుస్వామి గారికి ఫోన్ చేసి అడగ్గానే డబ్బులు పంపించారు. ఎవరికైనా ఏమన్నా కావాలంటే ఆయన హెల్ప్ చేస్తారు. మా అమ్మ చనిపోయాక డిప్రెషన్ కి వెళ్ళా. నన్ను ఎందుకు ఉంచావు, మా అమ్మని ఎందుకు తీసుకెళ్ళావు అని దేవుడి దగ్గర ఏడ్చేదాన్ని. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది కూడా అమ్మ హాస్పిటల్ బిల్స్ కట్టడం కోసమే అంటూ ఎమోషనల్ అయింది.
Also Read : Lady Anchor : సన్యాసం తీసుకోడానికి రెడీ అంటున్న హాట్ యాంకర్.. అది జరగకపోతే.. పదేళ్ల తర్వాత కాశీకే..
