Vishnupriya : బిగ్ బాస్ కి వెళ్లినందుకు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి నన్ను నేను.. అక్కడ మసాజ్ లేదు.. వచ్చిన డబ్బులు..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ కి వెళ్లినందుకు తనను తాను తిట్టుకున్నాను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Vishnupriya)

Vishnupriya : బిగ్ బాస్ కి వెళ్లినందుకు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి నన్ను నేను.. అక్కడ మసాజ్ లేదు.. వచ్చిన డబ్బులు..

Vishnupriya

Updated On : November 2, 2025 / 9:35 AM IST

Vishnupriya : యాంకర్ గా ఫేమ్ తెచ్చుకున్న విష్ణుప్రియ బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ తెచ్చుకొని ఇప్పుడు టీవీ షోలు, సినిమాలు, సిరీస్ లతో బిజీగానే ఉంది. సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ బిగ్ బాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(Vishnupriya)

విష్ణుప్రియ గతంలో బిగ్ బాస్ కి వెళ్ళను అని చెప్పింది కానీ డబ్బులు కోసం గత బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ కి వెళ్లినందుకు తనను తాను తిట్టుకున్నాను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Allu Sirish : నితిన్ భార్య వల్లే అల్లు శిరీష్ పెళ్లి.. రెండేళ్ల క్రితం తనని మొదటిసారి కలిశా అంటూ లవ్ స్టోరీ చెప్పిన శిరీష్..

విష్ణుప్రియ మాట్లాడుతూ .. బిగ్ బాస్ లో నేను ఏమి నేర్చుకోలేదు. అన్ని బయట నా లైఫ్ లోనే నేర్చుకున్నాను. మళ్ళీ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినా వెళ్ళను. ఒక్కసారి వెళ్ళినందుకే నన్ను నేను తిట్టుకున్నాను. ఎందుకు వెళ్ళావు, చెప్పు తీసుకొని కొట్టుకోవాలి అని నన్ను నేను తిట్టుకున్నా. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అన్ని రోజులు నన్ను నేను తిట్టుకున్నా. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నన్ను లవ్ చేసిన జనాలు ఉన్నారు కాబట్టి ఓకే అనుకున్నా.

నేను కొంచెం సెటిల్ అయి లగ్జరీ లైఫ్ బతుకుతున్నా ఆల్రెడీ. మూడు రోజులు పనిచేస్తే నాలుగో రోజు మసాజ్ చేయించుకొని రెస్ట్ తీసుకొని తర్వాత వర్క్ కి వెళ్తా. కానీ బిగ్ బాస్ లో మసాజ్ లేదు, కాఫీ లేదు, సరిగ్గా నిద్ర లేదు. చాలా పెయిన్ ఫుల్ షో నాకు. బిగ్ బాస్ కి వెళ్ళింది కొత్త ఇల్లు వస్తుంది డబ్బులు వస్తాయని వెళ్లాను. కానీ అది జరగలేదు. ఇంకా పాత ఇంట్లోనే ఉన్నాను. బిగ్ బాస్ కి వచ్చిన కొంత డబ్బు మాత్రం నా ఫ్రెండ్స్ ఫిక్సెడ్ డిపాజిట్ చేయించారు అని తెలిపింది.

Also See : Nara Rohith Wedding : హీరోయిన్ శిరీషతో హీరో నారా రోహిత్ పెళ్లి.. ఫోటోలు చూశారా?