Lady Anchor : సన్యాసం తీసుకోడానికి రెడీ అంటున్న హాట్ యాంకర్.. అది జరగకపోతే.. పదేళ్ల తర్వాత కాశీకే..
ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఓ హాట్ యాంకర్ చేరుతాను అంటోంది.(Lady Anchor)
Lady Anchor
Lady Anchor : ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు దైవ మార్గంలో నడుస్తున్నారు. గతంలో కొంతమంది సీనియర్ నటీనటులు కూడా సన్యాసం తీసుకున్న వాళ్ళు, అన్ని వదిలేసి దైవ చింతనలో మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఓ హాట్ యాంకర్ చేరుతాను అంటోంది.(Lady Anchor)
ఓ పదేళ్ల వరకు చూసి ఆ తర్వాత సన్యాసం లోకి వెళ్ళిపోతాను, చిన్నప్పట్నుంచీ ఆ ఆలోచనలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ యాంకరమ్మ ఎవరో కాదు విష్ణుప్రియ. యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ప్రస్తుతం నటిగా సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. తన సోషల్ మీడియాలో హాట్ హాట్ పోస్టులతో రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది విష్ణుప్రియ.
Also Read : Mahesh Babu : రాజమౌళి తర్వాత మహేష్ SSMB30 సినిమా ఆ స్టార్ డైరెక్టర్ తోనే..? కథ కూడా రెడీ..
విష్ణుప్రియ మాట్లాడుతూ.. నేను సన్యాసం తీసుకోడానికి రెడీ. నాకు నచ్చని అబ్బాయి రాకపోతే వెళ్ళిపోతాను. నేను గతంలోనే హరేరామ హరేకృష్ణ మూమెంట్ లోకి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇప్పుడు బ్రహ్మ కుమారీస్, కాశీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. చిన్నపట్నుంచి గీత ప్రెస్ ద్వారా భగవద్గీత ప్రచారంలో పాల్గొన్నా. నాకు భగవద్గీత మొత్తం వచ్చు. చాలా శ్లోకాలు, దేవుడి పాటలు వచ్చు. ఇటీవల సద్గురు ఆశ్రమంపై వెళ్లి వచ్చాక నాకు మంచిగా ఉంది. నాకు ఇంకో పదేళ్లు బాగానే ఉందని పంతులు గారు చెప్పారు. ఆ తర్వాత ఏమన్నా జరిగితే తట్ట బుట్ట సర్దుకొని కాశికి వెళ్ళిపోతా.
నేను లవ్ లో డిప్రెస్ అయ్యాను. మూడు లవ్ స్టోరీలు. మూడు బ్రేకప్స్ అయ్యాయి. సెకండ్ బ్రేకప్ మర్చిపోవడానికి మూడేళ్లు కాశీ, పవిత్ర్ర స్థలాలకు వెళ్ళను. చాలా టైం పట్టింది దాని నుంచి రికవరీ అవ్వడానికి. మెడిటేషన్ మీద ఫోకస్ చేస్తే మనల్ని మనం కంట్రోల్ లోకి తెచ్చుకుంటాం. గతంలో పాకెట్ మనీ కోసం భగవద్గీత చెప్పేదాన్ని. సినిమాల్లోకి రాకపోతే అదే చేసేదాన్ని. అందుకే నాకు చిన్నప్పట్నుంచీ సన్యాసం వైపు వెళ్లాలని ఆలోచనలు వచ్చేవి అని తెలిపింది. దీంతో పదేళ్ల తర్వాత అవకాశాలు లేకపోయినా, పెళ్లి కాకపోయినా విష్ణుప్రియ సన్యాసంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసింది.
