Sapthagiri : ‘సప్తగిరి’ అసలు పేరేంటో తెలుసా? పేరు మార్పు వెనక వేంకటేశ్వరస్వామి ఉన్నారట.. స్టోరీ ఇంట్రెస్ట్ గానే ఉంది..

ఓ ఇంటర్వ్యూలో తన అసలు పేరు సప్తగిరి కాదని, ఆ పేరు ఎలా వచ్చిందో తెలిపాడు. ఈ స్టోరీ కాస్త ఆసక్తిగానే ఉంది.

Do You Know Comedian Sapthagiri Real Name and how its comes

Sapthagiri : అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పరుగు సినిమాతో కమెడియన్ గా మారాడు సప్తగిరి. ఆ తర్వాత కమెడియన్ గా చాలా సినిమాల్లో మెప్పించి హీరో కూడా అయ్యాడు. హీరోగా కూడా పలు సినిమాలతో మెప్పించాడు. ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా పెళ్లి కానీ ప్రసాద్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మార్చ్ 21 రిలీజ్ కాబోతుంది.

పెళ్లి కానీ ప్రసాద్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సప్తగిరి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన అసలు పేరు సప్తగిరి కాదని, ఆ పేరు ఎలా వచ్చిందో తెలిపాడు. ఈ స్టోరీ కాస్త ఆసక్తిగానే ఉంది.

Also Read : Prabhas – Court Movie : నాని ‘కోర్ట్’ సినిమాకు వెళ్తే.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు..

సప్తగిరి మాట్లాడుతూ.. స్టూడెంట్ లైఫ్ అంతా సినిమాలు, క్రికెట్ తో నాశనం అయిపొయింది. ఇండస్ట్రీకి వచ్చేముందు నా ఇష్టదైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుందామని వెళ్ళాను. దర్శనం అయ్యాక అక్కడ మాడ వీధుల్లో నిల్చున్నాను ఆలయం ముందు. అప్పుడే కొంతమంది పీఠాధిపతులు, స్వామీజీలు నడుస్తూ వస్తున్నారు. నేను వాళ్లకు అడ్డంగా ఉండటంతో ఓ స్వామిజి నన్ను నాన్న సప్తగిరి పక్కకు జరుగు అన్నారు. నేను ఆయన్ను చూడగానే ఆయన నన్ను చూసి నవ్వారు. నాకు ఆ నవ్వు, ఆ పేరు ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చింది. దాంతో ఆ పేరు స్వామి దగ్గర రావడంతో సప్తగిరి అని పేరు పెట్టుకున్నాను. నా అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. ఆ పేరుని తిరుమలలో వదిలేసాను 20 ఏళ్ళ క్రితం. అప్పుడే నాన్ వెజ్ కూడా వదిలేసాను తిరుమలలో. ఇవాళ్టి వరకు కూడా నాన్ వెజ్ ముట్టుకోలేదు మళ్ళీ అని తెలిపారు.