Prabhas – Court Movie : నాని ‘కోర్ట్’ సినిమాకు వెళ్తే.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు..
ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసే అంశాలు ఉన్నాయట.

Prabhas Fans can Enjoy Nani Priyadarshi Court Movie Due to Mirchi Movie Refference
Prabhas – Court Movie : నాని ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాపై నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నాని సమర్పణలో రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రియదర్శి మెయిన్ లీడ్ గా తెరకెక్కిన సినిమా కోర్ట్. ఈ సినిమా మార్చ్ 14 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే పలు చోట్ల పెయిడ్ ప్రీమియర్లు వేశారు.
దీంతో సినిమా చూసిన వాళ్ళు కోర్ట్ రివ్యూలు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పోక్సో చట్టం ప్రధానాంశంగా ఈ సినిమాని తీశారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసే అంశాలు ఉన్నాయట. ఈ సినిమాలో హర్ష రోషన్ – శ్రీదేవి టీనేజ్ ప్రేమ జంటగా కనిపించారు. ఈ సినిమా 2013లో జరుగుతుంది.
Also Read : SSMB 29 : ముందే మహేష్ – రాజమౌళి సినిమా గురించి లీక్ చేసిన డిప్యూటీ సీఎం.. షూట్ ఎక్కడ చేస్తున్నారో చెప్పేసి..
కోర్ట్ సినిమాలో హర్ష రోషన్ – శ్రీదేవి, వాళ్ళ ఫ్రెండ్స్ సినిమాకు వెళ్లినట్టు ఓ సీన్ ఉంటుంది. అది ప్రభాస్ మిర్చి సినిమా కావడం గమనార్హం. 2013 ఫిబ్రవరిలో మిర్చి రిలీజయి మంచి హిట్ అయింది. కోర్ట్ సినిమాలో ప్రభాస్ మిర్చి సినిమాకు వైజాగ్ జగదాంబ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ హడావిడి చేసినట్టు, హాల్ లో రచ్చ చేసినట్టు, ప్రభాస్ వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ డైలాగ్, మిర్చి సాంగ్, మిర్చి సినిమాలో సీన్స్.. చూపించారట. కోర్ట్ సినిమాలో ప్రభాస్ రిఫరెన్స్, మిర్చి సినిమా రిఫరెన్స్ ఓ 5 నిముషాలు ఉంటుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి థియేటర్స్ లో పండగే అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు.
అలాగే అదే సంవత్సరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా రిలీజయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిఫరెన్స్ కూడా కోర్ట్ సినిమాలో చూపించారట. ప్రభాస్ ఫ్యాన్స్ మిర్చి సినిమా వైబ్ కోసం కోర్ట్ సినిమాకు వెళ్లొచ్చు అంటున్నారు.