Nani – Vijay Deverakonda : పదేళ్ల తర్వాత అదే ఫోటో రీ క్రియేట్ చేసిన ‘నాని – విజయ్ దేవరకొండ’.. ఫోటో వైరల్.. ఫ్యాన్స్ ఇప్పటికైనా మారాలి..
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా పదేళ్ల రీ యూనియన్ పార్టీ చేసుకుంది.

Nani Vijay Deverakonda Malavika Nair Re Create Yevade Subramanyam Photo goes Viral
Nani – Vijay Deverakonda : నాని, విజయ్ దేవరకొండ కలిసి గతంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2015లో రిలీజయి మంచి విజయం సాధించింది. కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాక క్లాసిక్ గా కూడా నిలిచింది. ఈ సినిమా రిలీజయి పదేళ్లు అవుతుండటంతో మార్చ్ 21న ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాని రీ రిలీజ్ కూడా చేయబోతున్నారు.
దానికంటే ముందు మూవీ యూనిట్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా పదేళ్ల రీ యూనియన్ పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, మూవీ యూనిట్ హాజరయ్యారు. అయితే ఈ సినిమాలో బైక్ పై విజయ్ డ్రైవ్ చేస్తుంటే వెనక నాని, మాళవిక నాయర్ కూర్చొని ఉన్న ఫోటో, ఆ సీన్ బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఆ ఫోటోని, సీన్ ని మూవీ యూనిట్ రీ క్రియేట్ చేసారు.
Also Read : Dil Raju : గద్దర్ అవార్డ్స్ పై దిల్ రాజు కీలక ప్రకటన..
ఆ బైక్ ని మళ్ళీ తీసుకొచ్చి విజయ్ డ్రైవ్ చేస్తున్నట్టు కూర్చోగా వెనక నాని, మాళవిక నాయర్ కూర్చున్నారు. దీంతో ఈ ఫోటో, వీడియో వైరల్ గా మారాయి. అయితే కొన్నాళ్ల క్రితం నాని – విజయ్ దేవరకొండ మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. నాని – విజయ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసుకున్నారు. ఈ ఫ్యాన్ వార్స్ మొదలయ్యాక ఓ రెండు మూడు సార్లు నాని – విజయ్ కలిసి కనపడ్డారు, ఒకరి గురించి ఒకరి అభినందిస్తూ ట్వీట్స్ చేసారు. అయినా ఇంకొంతమంది ఫ్యాన్స్ ఫ్యాన్ వార్స్ మాత్రం ఆపట్లేదు.
Also Read : Bhadrakaali Teaser : విజయ్ ఆంటోనీ భద్రకాళి టీజర్.. రూ. 197 కోట్లా?
ఇపుడు నాని – విజయ్ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఈ ఫోటోలు చూసి అయినా ఫ్యాన్స్ మారతారేమో, నాని – విజయ్ మధ్య ఎలాంటి విబేధాలు లేవని గ్రహిస్తారేమో చూడాలి. గతంలో మహేష్ బాబు చెప్పినట్టు మేము మేము బాగానే ఉంటాం. మీరు మీరు బాగుండాలి అనేది నిజం. సెలబ్రిటీలు అంతా బాగానే ఉంటారు. మధ్యలో ఫ్యాన్స్ మాత్రం మా హీరో మా హీరో అని గొడవలు పెట్టుకుంటారు. ఈ ఫోటో చూసిన తర్వాత కూడా నాని – విజయ్ ఫ్యాన్ వార్స్ ఆపకపోతే కష్టమే.