Bhadrakaali Teaser : విజ‌య్ ఆంటోనీ భ‌ద్ర‌కాళి టీజ‌ర్‌.. రూ. 197 కోట్లా?

విజ‌య్ ఆంటోనీ హీరోగా తెర‌కెక్కుతున్న‌ భ‌ద్ర‌కాళి చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

Bhadrakaali Teaser : విజ‌య్ ఆంటోనీ భ‌ద్ర‌కాళి టీజ‌ర్‌.. రూ. 197 కోట్లా?

Vijay Antony Bhadrakaali Teaser out now

Updated On : March 12, 2025 / 6:47 PM IST

విజ‌య్ ఆంటోనీ హీరోగా తెర‌కెక్కుతున్న‌ చిత్రం భ‌ద్ర‌కాళి. అరుణ్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ విజ‌య్ ఆంటోనీ కెరీర్‌లో 25వ చిత్రం కావ‌డం విశేషం. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

‘పిల్లి కూడా ఒక రోజు పులి అవుతుంది.. అబద్దం, అహంకారం అంతం అవును’ అనే డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. రాజ‌కీయ వ్య‌వ‌స్థ నేప‌థ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో హీరో పాత్ర గ్యాంగ్ స్ట‌ర్‌తో పాటు మ‌రికొన్ని కోణాల్లో క‌నిపించ‌నున్న‌ట్లు టీజ‌ర్ ను బ‌ట్టీ తెలుస్తోంది.

Mohan Babu – Soundarya : మోహన్ బాబు ఇష్యూ.. దివంగ‌త న‌టి సౌంద‌ర్య భ‌ర్త బ‌హిరంగ లేఖ‌..

ఇది వరకు ఎన్నడూ కనిపించినంత స్టైలీష్‌గా, యాక్షన్ హీరోగా విజ‌య్ కనిపిస్తున్నారు. ఇక టీజ‌ర్ చివ‌ర‌ల్లో రూ.197 కోట్లా? ఇది ఆరంభమే అంటూ వ‌చ్చిన డైలాగ్ సినిమాపై అంచాల‌ను పెంచుతోంది.

వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి విజ‌య్ ఆంటోనీనే సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మూవీ టీమ్ భావిస్తోంది.