Dil Raju : గద్దర్ అవార్డ్స్ పై దిల్ రాజు కీలక ప్రకటన..
గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు నిర్మాత దిల్ రాజు.

Producer Dil Raju Press Meet About Gaddar Award
తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏప్రిల్ నెలలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.
సమాచార భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్‌రాజ్ ఈ విషయాలను చెప్పారు. గద్దర్ అవార్డ్స్ కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ గైడ్ లైన్స్ ని ప్రిపేర్ చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి అంటే.. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాది ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా చెప్పారు.
Bhadrakaali Teaser : విజయ్ ఆంటోనీ భద్రకాళి టీజర్.. రూ. 197 కోట్లా?
నంది అవార్డ్స్ కు ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అలాగే చిన్న చిన్న మార్పులతో గద్దర్ అవార్డ్స్ కూడా అలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయన్నారు. ఏప్రిల్‌లో అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరుపుకుందామన్నారు. గతంలో సింహా అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పుడు ఎఫ్‌డీసీకి కొంత నగదు ఇచ్చినట్లుగా తెలిసింది. వారికి ఇప్పుడు ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తామన్నారు.
ప్రతి ఒక్కరు పాజిటివ్‌గా అనుకుని విజయవంతం చేయాలి. అప్పుడు మాత్రమే ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోగలం అని దిల్ రాజు తెలిపారు.