David Warner : ‘రాబిన్ హుడ్’ సినిమాకు ‘డేవిడ్ వార్నర్’ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? బాగానే ఇచ్చారుగా..
ఇప్పటికే రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ లో డేవిడ్ వార్నర్ స్టైలిష్ గా హెలికాఫ్టర్ లోంచి దిగి వస్తున్నట్టు చూపించారు.

Do You Know David Warner Remuneration for Nithiin Robinhood Movie
David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో తెలుగు సినిమాల డైలాగ్స్, సాంగ్స్ తో రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో నటించి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ లో డేవిడ్ వార్నర్ స్టైలిష్ గా హెలికాఫ్టర్ లోంచి దిగి వస్తున్నట్టు చూపించారు.
అయితే డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండటంతో ఆస్ట్రేలియా నెటిజన్లు, వేరే క్రికెటర్స్, డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ వల్ల సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా డేవిడ్ వార్నర్ వచ్చి సందడి చేసాడు. ఈ క్రమంలో ఈ సినిమాకు డేవిడ్ వార్నర్ తీసుకున్న రెమ్యునరేషన్ చర్చగా మారింది.
Also Read : Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..
డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాకు దాదాపు రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. సినిమాలో నటించినందుకు గాను, రెండు రోజులు ప్రమోషన్స్ లో పాల్గొన్నందుకు గాను ఈ రెమ్యునరేషన్ ఇచ్చారంట మూవీ యూనిట్. సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్ర బాగా పేలితే కచ్చితంగా టాలీవుడ్ నుంచి ఆఫర్స్ బాగా వస్తాయి అని భావిస్తున్నారు. మరి డేవిడ్ వార్నర్ భవిష్యత్తులో టాలీవుడ్ లో ఇంకా సినిమాలు చేస్తాడా లేదా చూడాలి.