Director Maruthi
Director Maruthi : పోస్టర్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్ గా కెరీర్ మొదలుపెట్టిన మారుతి ఈ రోజుల్లో అనే చిన్న సినిమాతో దర్శకుడిగా మారి చిన్న సినిమాలు తీస్తూ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో మెప్పిస్తూ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా తీసే రేంజ్ కి ఎదిగాడు.(Director Maruthi)
భారీ బడ్జెట్ తో మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఫాంటసీగా రాజాసాబ్ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇప్పటివరకు కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ రాజాసాబ్ సినిమాకు తీసుకున్నాడట మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాకు గాను డైరెక్టర్ మారుతీ ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.
ఈ సినిమా వర్క్ మొదలయి ఆల్మోస్ట్ మూడేళ్లు అవుతుంది. మూడేళ్ళ కష్టానికి గాను మారుతీకి 18 కోట్లు ఇచ్చారని సమాచారం. ఇక రాజాసాబ్ సినిమాకు దాదాపు 350 నుంచి 400 కోట్ల వరకు బడ్జెట్ అయిందని టాలీవుడ్ టాక్. ఇందులో ఎక్కువగా గ్రాఫిక్స్ కే ఖర్చుపెట్టారట. మరి రాజాసాబ్ సినిమా ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.