Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్.. న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ కి పండగే.. ఆగిపోయిన సినిమా మళ్ళీ లైన్లోకి..

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను నేడు ప్రకటించారు. (Pawan Kalyan)

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్.. న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ కి పండగే.. ఆగిపోయిన సినిమా మళ్ళీ లైన్లోకి..

Pawan Kalyan

Updated On : January 1, 2026 / 10:57 AM IST
  • పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన
  • ప్లాప్ డైరెక్టర్ తో సినిమా అనౌన్స్
  • డైరెక్టర్, రైటర్ తో పవన్ ఫోటో వైరల్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓ పక్క డిప్యూటీ సీఎం గా బిజీగా ఉండటంతో చేతిలో ఉన్న సినిమాలు చేసి ఆపేస్తారనే అనుకుంటున్నా ఫ్యాన్స్. కానీ OG పెద్ద హిట్ అవడంతో OG 2 కూడా చేస్తానని ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాగూ రానుంది. అయితే తాజాగా ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ రోజు ఫుల్ సంతోషాన్ని ఇచ్చే వార్త ప్రకటించారు.(Pawan Kalyan)

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను నేడు ప్రకటించారు. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ హీరోగా గతంలో ఓ సినిమాని ప్రకటించారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, వేరే సినిమాలతో ఈ సినిమా పక్కన పెట్టేసారు అనుకున్నారు అంతా. కానీ నేడు ఇదే సినిమాని మళ్ళీ కొత్తగా ప్రకటించారు.

Also Read : Prabhas : ప్రభాస్ ఘాటు రొమాన్స్, నాటు యాక్షన్.. హీరోయిన్ తో లిప్ కిస్..? సిక్స్ ప్యాక్ తో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్..

నిర్మాత రామ్ తాళ్లూరి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఈ సినిమాని ప్రకటించారు. రామ్ తాళ్లూరి ప్రస్తుతం జనసేనలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. రామ్ తాళ్లూరి ఈ సినిమా గురించి ప్రకటిస్తూ.. నా డ్రీం కొత్త నిర్మాణ సంస్థ, పవన్ కళ్యాణ్ పేరు పెట్టిన సంస్థ జైత్ర రామ్ మూవీస్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ తో కలిసి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయబోతున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్ళుగా తక్కువ హెయిర్ ఉన్న కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఇది ఈ సినిమా కోసమే అని ఇప్పుడు అంతా భావిస్తున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎం గా ఎంత బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటించడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. రామ్ తాళ్లూరి గతంలో నిర్మాతగా SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నేల టికెట్, చుట్టాలబ్బాయి, మెకానిక్ రాకీ.. లాంటి పలు సినిమాలని నిర్మించారు. అయితే సురేందర్ రెడ్డి గత సినిమా ఏజెంట్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan New Movie Announced under Surendar Reddy Direction

Also See : Anasuya Bharadwaj : న్యూ ఇయర్ స్పెషల్.. స్విమ్మింగ్ పూల్ లో భర్తతో కలిసి అనసూయ రచ్చ.. ఫొటోలు వైరల్..

Pawan Kalyan New Movie Announced under Surendar Reddy Direction