Do you know how many hours Salman Khan sleeps a day
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఈ కండల వీరుడికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కాగా.. ఈ స్టార్ హీరో రోజులో రెండు లేదా మూడు గంటలు మాత్రమే నిద్రపోతాడట. ఇక నెలలో అయితే.. కేవలం రెండు లేదా మూడు సార్లు మాత్రమే ఏడు నుంచి 8 గంటలు పడుకుంటాడట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. స్వయంగా సల్మాన్ ఖాన్ చెప్పాడు.
తన మేనల్లుడు అర్హాన్ ఖాన్ నిర్వహిస్తున్న ఓ పోడ్ కాస్ట్‌లో పాల్గొని మాట్లాడాడు. ఈ షోలో ఎన్నో పర్సనల్ విషయాలను సల్మాన్ షేర్ చేసుకున్నాడు. కృష్ణ జింక వేటాడిన కేసులో జైలు జీవితాన్ని గడిపిన రోజులను గుర్తు చేసుకున్నాడు. ‘నేను సాధారణంగా రోజు రెండు గంటలు నిద్రపోతాను. నెలకు ఓసారి లేదా రెండు సార్లు ఏడు నుంచి 8 గంటలు పడుకుంటాను.
Allu Arjun: పుష్ప 2 థ్యాంక్స్ మీట్‌లో అల్లు అర్జున్ భావోద్వేగభరిత కామెంట్స్.. కంటతడి..
కొన్నిసార్లు షూటింగ్ మధ్య బ్రేక్ దొరికినా ఛైర్ మీదే నిద్రపోతాను. ఇకేం పని లేదు అని అనిపించినప్పుడు నిద్రపోతాను. జైలులో ఉన్నప్పుడు ఎక్కువగా పడుకునేవాడిని, అది ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి.’ అని సల్మాన్ తెలిపాడు.
ఇక పని, కుటుంబం విషయానికి వస్తే.. ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఉండాలన్నాడు. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సల్మాన్ సూచించాడు. 1998లో కృష్ణ జింకను వేటాడడంలో సల్మాన్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2006లో ఆయనకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ కేసులో బెయిల్ వచ్చినా కొన్ని రోజుల పాటు సల్మాన్ శిక్ష అనుభవించక తప్పలేదు.
Monalisa : ఫస్ట్ సినిమాకి మోనాలిసా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సల్మాన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే చిత్రంలో నటిస్తున్నారు.