Monalisa : ఫస్ట్ సినిమాకి మోనాలిసా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
వైరల్ గర్ల్ మోనాలిసా ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా అనే యువతి ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందమైన కళ్లు, చక్కని చిరునవ్వుతో ఆమె రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తాను తెరకెక్కించే చిత్రంలో మోనాలిసాకు ఓ పాత్ర ఇవ్వనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.
‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రాన్ని సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోనాలిసాకు అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని మోనాలిసా స్వగ్రామానికి వెళ్లి.. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించారు. మోనాలిసాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి మరో నెలరోజుల సమయం ఉందని, ఈలోగా మోనాలిసాకు నటనలో శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు.
Lavanya : వాటి కోసమే మస్తాన్ సాయి ఇంటికి వెళ్లింది.. లావణ్య నాయవాది కామెంట్స్..
కాగా.. మోనాలిసా తొలి సినిమా పారితోషికానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాకి గాను మోనాలిసాకు రూ.21 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా సదరు వార్తల సారాంశం.
అంతేకాదండోయ్.. స్థానికంగా ఉన్న వాటి బిజినెస్ ప్రమోషన్స్ కోసం (లోకల్ బ్రాండింగ్) కోసం రూ.15 లక్షల కాంట్రాక్ట్ సైతం ఆమె పొందినట్లు ప్రచారం జరుగుతోంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని మహేశ్వర్ మోనాలిసా స్వస్థలం. ఉత్తరప్రదేశ్‌లోని ప్రారంభమైన మహాకుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు ఆమెతో పాటు ఆమె కుటుంబం వచ్చింది. ఓ సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ వీడియో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. దీంతో ఆమె సెలబ్రిటీ అయిపోయింది.