Thandel Collections : తండేల్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్‌..

అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన తండేల్ మూవీకి ఫ‌స్ట్ డే అదిరిపోయే క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

Thandel Collections : తండేల్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్‌..

Updated On : February 8, 2025 / 5:57 PM IST

అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన‌ మూవీ తండేల్‌. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు ఈ మూవీని నిర్మించారు. శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 7న) ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ క్ర‌మంలో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న దూకుడును మొద‌లు పెట్టింది.

ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి రోజే రూ.21.27 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. అక్కినేని నాగ చైత‌న్య కెరీర్‌లో తొలి రోజే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా తండేల్ నిలిచింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది. సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవ‌డంతో వీకెండ్‌లో ఈ చిత్ర క‌లెక్ష‌న్లు అమాంతం పెరిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

ప్రధాని మోదీతో వీడియో కాల్ లో చిరంజీవి.. సౌత్ సినిమాని వరల్డ్ వైడ్ ఫేమస్ చేశారంటూ..

విదేశాల్లో ఈ చిత్రం తొలి రోజే రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ మ‌రో పోస్ట‌ర్‌లో వెల్ల‌డించింది. ‘అలలు మరింత బలపడుతున్నాయి’ అంటూ రాసుకొచ్చింది. విదేశాల్లోనే ఈ చిత్రం సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Benefit Shows : ఇకపై బెనిఫిట్ షోలు ఉండవా? తెలంగాణలో సరే.. ఏపీలో కూడా ఉండవా?

ఈ చిత్రంలో చైతన్య నటనకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. రాజు, సత్య పాత్రలో నాగచైతన్య, సాయి పల్లవి జీవించేశారని చెబుతున్నారు. ఇక ఎమోషనల్ సీన్లలో అయితే.. చైతూ ఏడిపించేశాడని కొనియాడుతున్నారు.