ప్రధాని మోదీతో వీడియో కాల్ లో చిరంజీవి.. సౌత్ సినిమాని వరల్డ్ వైడ్ ఫేమస్ చేశారంటూ..

వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్ అడ్వైజ‌రీ బోర్డులో త‌న‌ను భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ప్రధాని మోదీతో వీడియో కాల్ లో చిరంజీవి.. సౌత్ సినిమాని వరల్డ్ వైడ్ ఫేమస్ చేశారంటూ..

WAVES Advisory Board Meeting chiranjeevi thanks to pm modi

Updated On : February 8, 2025 / 11:51 AM IST

భార‌త్‌ను గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్‌గా మార్చాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ క్ర‌మంలో ఈ ఏడాది చివ‌రిలో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌(WAVES)’ను నిర్వ‌హించ‌నుంది. ఈ నేప‌థ్యంలో వేవ్స్ 2025 గురించి చ‌ర్చించేందుకు ప్ర‌ధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశవిదేశాలకు చెందిన సినీ, వ్యాపార ప్రముఖులతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఈ భేటీలో ప్ర‌ముఖ సినీ న‌టులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, చిరంజీవి, మోహన్ లాల్, రజ‌నీకాంత్, ఆమిర్ ఖాన్, ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనే త‌దిత‌రులు పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపార‌వేత్త‌లు సైతం పాల్గొన్నారు. స‌మ్మిట్ కోసం వారి అంద‌రి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తీసుకున్నారు.

Benefit Shows : ఇకపై బెనిఫిట్ షోలు ఉండవా? తెలంగాణలో సరే.. ఏపీలో కూడా ఉండవా?

మోదీకి ధ‌న్య‌వాదాలు..

భేటీ అనంత‌రం చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అడ్వైజ‌రీ బోర్డ్‌లో భాగం కావ‌డం త‌న‌కు ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. మోదీతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. ప్ర‌ధాని ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

Dinesh Mahindra : డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తనయుడు.. తండ్రి బాటలో తనయుడు..

ఇదో గొప్ప ప్ర‌య‌త్నం..

ప్రముఖులతో సమావేశం తర్వాత ప్ర‌ధాని మోదీ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. WAVES సలహా మండలి సమావేశం ముగిసింద‌ని చెప్పారు. ఈ గ్లోబల్ సమ్మిట్.. వినోదం, సృజనాత్మకత, సంస్కృతిని ఒకే వేదికపైకి తీసుకురావడానికి గొప్ప ప్రయత్నమన్నారు. సలహా మండలిలో సభ్యులుగా వున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించడమే కాకుండా దేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా ఎలా మార్చవచ్చనే దానిపై కీలక సూచనలు ఇచ్చిన‌ట్లుగా పేర్కొన్నారు.