Benefit Shows : ఇకపై బెనిఫిట్ షోలు ఉండవా? తెలంగాణలో సరే.. ఏపీలో కూడా ఉండవా?

భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవటం, బెనిఫిట్ షోలకు పర్మిషన్ తెచ్చుకోవటం, స్పెషల్ ప్రీమియర్ షోలు వేయటం లాంటివి చేస్తుంటారు మేకర్స్.

Benefit Shows : ఇకపై బెనిఫిట్ షోలు ఉండవా? తెలంగాణలో సరే.. ఏపీలో కూడా ఉండవా?

No Benefit Shows in AP and Telangana States Producers also Rejecting Benefit Shows

Updated On : February 7, 2025 / 7:44 PM IST

Benefit Shows : ఏ పెద్ద హీరో మూవీ వచ్చినా, లేక మంచి టాక్‌ ఉన్న సినిమా రిలీజ్ అవుతున్నా వినిపించే మాట బెనిఫిట్‌ షోలు. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవటం, బెనిఫిట్ షోలకు పర్మిషన్ తెచ్చుకోవటం, స్పెషల్ ప్రీమియర్ షోలు వేయటం లాంటివి చేస్తుంటారు మేకర్స్. ఇవి కొన్నిసార్లు సినిమాకు ప్లస్ అయితే చాలా సార్లు మైనస్ అవుతున్నాయి.

ఈ బెనిఫిట్స్ షోలతో జనం పడుకుని లేవక ముందే రివ్యూలు, పబ్లిక్ టాక్‌లు వచ్చేస్తున్నాయి. అంతేకాదు HD క్వాలిటీతో మూవీ ప్రింట్ కూడా లీక్ అయి బయటికి వస్తుంది. దీంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారట. తెలంగాణలో బెనిఫిట్ షోలు వేయటానికి ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. టిక్కెట్ రేట్ల పెంపు కూడా పర్మిషన్ లేదు అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు తెలంగాణలో.

Also Read : Dinesh Mahindra : డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తనయుడు.. తండ్రి బాటలో తనయుడు..

అయితే ఏపీలో ఇప్పుడు బెనిఫిట్‌ షోలు, టికెట్ల రేట్ల పెంచుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఏపీలో కూడా బెనిఫిట్ షోలు వేయొద్దనుకుంటున్నారట టాలీవుడ్ మూవీ మేకర్స్. అంటే ఇక ముందు బెనిఫిట్ షోస్ ఉండవన్నమాట. ఇదే మాట నిర్మాత అల్లు అరవింద్ కూడా చెప్పారు. మిగతా ప్రొడ్యూసర్స్ కూడా బెనిఫిట్‌ షోల అవసరం లేదంటున్నారట. సినిమాకు నెగిటివ్ టాక్‌ తెస్తున్న బెనిఫిట్‌ షోల కంటే రెగ్యులర్‌ షోస్ వేసుకోవటమే బెటర్ అనుకుంటున్నారట.

Also Read : JACK Teaser : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జాక్ టీజర్ చూశారా? హీరో ఏం పని చేస్తాడో తెలుసా?

అర్ధరాత్రుళ్లు, తెల్లవారుజామున నిద్రమత్తులో వచ్చి సినిమాని చూడటంతో అది జనాలకు సరిగ్గా ఎక్కకపోవడంతో నెగిటివ్ టాక్ వెళ్తుందని, అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్ రివ్యూలు వచ్చేస్తున్నాయని టాలివుడ్ నిర్మాతలు బెనిఫిట్ షోలు వద్దనుకుంటున్నాను. ఇప్పటికే నిర్మాతలు అల్లు అరవింద్, నాగవంశీ బెనిఫిట్ షోలు వద్దు అనుకున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాతో దిల్ రాజు కూడా బెనిఫిట్ షోలు వద్దనే ఆలోచనలోనే ఉన్నారు. టాలీవుడ్ నుంచే బెనిఫిట్ షోలు వద్దనుకుంటే అప్పుడు బెనిఫిట్‌ షోల కోసం ప్రభుత్వాలను బ్రతిమిలాడాల్సిన అవసరం ఉండదు. మూవీకి నెగెటివ్‌ టాక్‌ రాకుండా కూడా జాగ్రత్త పడొచ్చని భావిస్తున్నారట. బెనిఫిట్‌ షోల విషయంలో టాలీవుడ్‌ నిర్మాతల క్లియర్‌ కట్‌ స్టాండ్‌ ఏంటో వేచి చూడాలి మరి.