BiggBoss Winning Amount : బిగ్‌బాస్.. విన్నర్ కంటే ఎక్కువ గెలుచుకున్న రన్నరప్.. ఎవరికి ఎంతో తెలుసా??

ఇక విన్నర్ కి ముందు నుంచి 50 లక్షలు మనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అందులో 40 లక్షలు శ్రీహాన్ కి ఇచ్చేయడంతో విన్నర్ రేవంత్ కి 10 లక్షలు క్యాష్ తో పాటు.............

BiggBoss Winning Amount : బిగ్‌బాస్.. విన్నర్ కంటే ఎక్కువ గెలుచుకున్న రన్నరప్.. ఎవరికి ఎంతో తెలుసా??

do you know how much BiggBoss Winning Amount

Updated On : December 19, 2022 / 7:01 AM IST

BiggBoss Winning Amount :  బిగ్‌బాస్ సీజన్ 6 ఘనంగా 21 మందితో మొదలై 14 వారాలు సాగింది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫినాలే ఎపిసోడ్ ని మరింత గ్రాండ్ గా చేశారు బిగ్‌బాస్ నిర్వాహకులు. అన్ని వారాలు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటూ టాప్ 5లో కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహన్, రేవంత్ లు నిలవగా గ్రాండ్ ఫినాలేలో చివరికి శ్రీహాన్, రేవంత్ లు మిగిలారు.

వీరికి డబులు ఆఫర్ చేశాడు నాగార్జున. విన్నర్ మనీ 50 లక్షల్లో నుంచి 10 లక్షలతో మొదలుపెట్టి చివరికి 40 లక్షల వరకు తీసుకెళ్లాడు నాగ్. ఇంట్లో వాళ్ళ కోసం అంటూ శ్రీహాన్ డబ్బులు తీసుకొని రన్నరప్ అని ఒప్పేసుకున్నాడు. దీంతో రేవంత్ ని విన్నర్ అని ప్రకటించాడు నాగ్. కానీ శ్రీహాన్ డబ్బులు తీసుకోకపోతే అతనే విన్నర్ అయ్యేవాడని, రేవంత్ కంటే ఆడియన్స్ ఓట్లు శ్రీహాన్ కే ఎక్కువ పడ్డాయని చెప్పాడు నాగార్జున.

BiggBoss 6 Finale : బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్.. కానీ ప్రేక్షకులు శ్రీహన్ కి ఓట్లేశారన్న నాగ్..

ఇక విన్నర్ కి ముందు నుంచి 50 లక్షలు మనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అందులో 40 లక్షలు శ్రీహాన్ కి ఇచ్చేయడంతో విన్నర్ రేవంత్ కి 10 లక్షలు క్యాష్ తో పాటు 25 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం, 10 లక్షలు విలువ చేసే మారుతి కారు అందించారు. కానీ రన్నరప్ కి మాత్రం 40 లక్షలు మనీతో పాటు 5 లక్షలు లెన్స్ కార్ట్ ఆఫర్స్ లభించాయి. దీంతో విన్నర్ కంటే రన్నరప్ శ్రీహాన్ ఎక్కువ మనీ గెలుచుకున్నట్టు అయింది. అయితే రేవంత్ ట్రోఫీ అందుకున్నాడు అనే ఆనందంలో ఉన్నాడు.