Kamal Haasan : ‘కమల్ హాసన్’ ఆస్తులు విలువ ఎంతో తెలుసా? అప్పులు ఎన్నంటే?

నామినేషన్ లో కమల్ హాసన్ తన ఆస్తులు, తనకు ఉన్న అప్పుల గురించి తెలిపాడు.

Do You Know Kamal Haasan Properties and Loans Value

Kamal Haasan : కమల్ హాసన్ ఇటీవలే థగ్ లైఫ్ సినిమాతో రాగా ఆ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. తాజాగా కమల్ ఆస్తుల విలువ వైరల్ గా మారింది. ఇటీవల కమల్ తమిళనాడు నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. తన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ తమిళనాడులోని అధికార పార్టీ DMK కి సపోర్ట్ ఇవ్వడంతో ఆ పార్టీ సపోర్ట్ తో రాజ్యసభకు నామినేషన్ వేసాడు.

ఈ నామినేషన్ లో కమల్ హాసన్ తన ఆస్తులు, తనకు ఉన్న అప్పుల గురించి తెలిపాడు.

Also Read : Shambhala : ఆది సాయి కుమార్ ‘శంబాల’ టీజర్ రిలీజ్.. ఆ గ్రామంలో ఏం జరుగుతుంది?

కమల్ హాసన్ కు మొత్తం 305.55 కోట్ల ఆస్తి ఉంది. అందులో 245.86 కోట్ల స్థిరాస్తి, 59.69 కోట్లు చరాస్తి ఉంది. కమల్ హాసన్ కి నాలుగు కమర్షియల్ బిల్డింగ్స్ ఉండగా వాటి విలువ 111.1 కోట్లు ఉంది. అలాగే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉండగా దాని విలువ 22. 24 కోట్లు ఉంది. 2023-24 వార్షిక సంవత్సరానికి 78.9 కోట్లు సంపాదించినట్టు తెలిపాడు.

ఇక కమల్ దగ్గర బెంజ్, BMW, లెక్సస్, మహీంద్రా కంపెనీలకు చెందిన ఖరీదైన కార్లు నాలుగు ఉండగా వాటి విలువ 8.43 కోట్లు. అలాగే ప్రస్తుతం చేతిలో 2.6 లక్షల క్యాష్ ఉన్నట్టు తన నామినేషన్స్ లో పేర్కొన్నారు. ఇక కమల్ కి లోన్స్ రూపంలో 49.67 కోట్ల అప్పులు ఉన్నటు తెలిపారు.

Also Read : Deepika Padukone : దీపికా కండిషన్స్.. నో అన్న సందీప్ వంగ.. మరి అట్లీ ఓకే చెప్పాడా? 40 కోట్లు ఇస్తున్నారా?