Shambhala : ఆది సాయి కుమార్ ‘శంబాల’ టీజర్ రిలీజ్.. ఆ గ్రామంలో ఏం జరుగుతుంది?

మీరు కూడా శంబాల టీజర్ చూసేయండి..

Shambhala : ఆది సాయి కుమార్ ‘శంబాల’ టీజర్ రిలీజ్.. ఆ గ్రామంలో ఏం జరుగుతుంది?

Aadi Sai Kumar Archana Iyer Shambhala Movie Teaser Released

Updated On : June 7, 2025 / 1:42 PM IST

Shambhala : ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శంబాల’. ఎ మిస్టికల్ వరల్డ్ అనేది ట్యాగ్ లైన్. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్‌ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మాణంలో యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసారు.

Also Read : Aha Sarkaar : ‘సుడిగాలి సుధీర్’ ఆహా ‘సర్కార్’ గేమ్ లో మీరు కూడా ఇంటినుంచే ఆడొచ్చు .. ఎలా అంటే..

మీరు కూడా శంబాల టీజర్ చూసేయండి..

ఈ టీజర్ చూస్తుంటే పీరియాడిక్ సూపర్ నేచుర్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది.. టీజర్ లో.. ఆకాశం నుంచి ఓ రాయి లాంటి వస్తువు వచ్చి ఓ గ్రామంలో పడిన దగ్గర్నుంచి ఆ గ్రామంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం, మనుషులు చనిపోతుండటం జరుగుతూ ఉంటుంది. ఆ ఊరికి ఆది సాయి కుమార్ వస్తే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాడు, ఆ గ్రామంలో ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొనేలా చూపించారు. ఇక ఈ టీజర్ ని సోషల్ మీడియా ద్వారా దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసారు.

Also Read : Deepika Padukone : దీపికా కండిషన్స్.. నో అన్న సందీప్ వంగ.. మరి అట్లీ ఓకే చెప్పాడా? 40 కోట్లు ఇస్తున్నారా?