Deepika Padukone : దీపికా కండిషన్స్.. నో అన్న సందీప్ వంగ.. మరి అట్లీ ఓకే చెప్పాడా? 40 కోట్లు ఇస్తున్నారా?
దీపికా - సందీప్ వంగ వివాదం కొన్ని రోజులు సాగింది.

Deepika Padukone Selected for Atlee Allu Arjun Movie after Sandeep Reddy Vanga Prabhas Spirit Rejection
Deepika Padukone : ఇటీవల ప్రభాస్ – సందీప్ వంగ స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ హీరోయిన్ గా అనుకున్నారు. సందీప్ కథ చెప్పగా దీపికా ఓకే అంది. కానీ తర్వాత దీపికా రోజుకి 6 నుంచి 8 గంటలు మాత్రమే పనిచేస్తాను, 40 కోట్ల రెమ్యునరేషన్ కావాలి, ప్రాఫిట్స్ లో షేర్ కావాలి, తెలుగు డబ్బింగ్ చెప్పను.. అని ఇలా పలు కండిషన్స్ పెట్టిందట. ఈ క్రమంలో సందీప్ కి కోపం వచ్చి దీపికాని తప్పించి త్రిప్తి డిమ్రి ని హీరోయిన్ గా అనౌన్స్ చేసారు.
దీంతో దీపికా తన పీఆర్ టీమ్ తో త్రిప్తిపై, తనపై నెగిటివ్ ప్రచారం చేయించి, స్పిరిట్ స్టోరీ లైన్ ఒక మీడియాకు లీక్ చేసిందని సందీప్ వంగ ఇండైరెక్ట్ గా ఆమె పేరు పెట్టకుండా సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. ఇలా దీపికా – సందీప్ వివాదం కొన్ని రోజులు సాగింది. ఇది జరిగిన 10 రోజులకే నేడు అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో దీపికా పదుకోన్ ని హీరోయిన్ గా అనౌన్స్ చేస్తూ వీడియోని రిలీజ్ చేసారు.
దీంతో దీపికా పదుకోన్ మరోసారి వార్తల్లో నిలుస్తుంది. అట్లీ దీపికా చెప్పిన కండిషన్స్ కి ఒప్పుకున్నాడా? దీపికకు 40 కోట్లు ఇవ్వడానికి నిర్మాణ సంస్థ ఒప్పుకుందా? తెలుగులో దీపికా డబ్బింగ్ చెప్పదా? షూటింగ్ కి కేవలం 6 నుంచి 8 గంటలే టైం ఇస్తుందా.. ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీపికా అట్లీకి కూడా కండిషన్స్ పెట్టిందా, లేదా? పెడితే అట్లీ ఒప్పుకున్నాడా అని చర్చ జరుగుతుంది. మొత్తానికి ఓ భారీ సినిమా ఛాన్స్ మిస్ అయినా మరో భారీ పాన్ ఇండియా సినిమాలో దీపికా ఛాన్స్ కొట్టేసింది. మరి దీనిపై సందీప్ రెడ్డి వంగ ఏమైనా స్పందిస్తాడా చూడాలి.
అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో చూసేయండి..
Also Read : Manchu Vishnu – Rajinikanth : కన్నప్ప సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ తీసేసాం.. మంచు విష్ణు కామెంట్స్..